తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ ఆశలు ఆవిరైపోయాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించాయి.
Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గతంతో పోలిస్తే ఎమ్మెల్యే సీట్లను ఓట్లను పెంచుకోగలిగింది. తామే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అని కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు చెప్పిన బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత సైలెంట్ అయింది. మరోవైపు కర్ణాటక విజయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి జోష్ పెంచింది. అయితే గతంలో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కస్థానంలోనే గెలుపొందిన బీజేపీ, ఈ సారి 8 స్థానాలను గెలుచుకుంది.
Kamareddy: కామారెడ్డిలో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలే కాకుండా, దేశం మొత్తం కామారెడ్డి నియోజకవర్గంపై ఆసక్తి కనబర్చాయి. సీఎం కేసీఆర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిగా చెప్పబడుతున్న రేవంత్ రెడ్డిని బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి ఓడించారు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగా ఈ సీటులో హోరాహోరీ పోరు జరిగింది. క్షణక్షణానికి, రౌండ్ రౌండ్‌కి ఆధిక్యం మూడు పార్టీల మధ్య మారుతూ వచ్చింది. చివరకు కామారెడ్డి ఓటర్ స్థానిక అభ్యర్థికే పట్టం కట్టారు. ఇద్దరు…
RGV: తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎన్నికల లెక్కింపు ఈరోజు జరుగుతున్న విషయం తెల్సిందే. బీఆర్ ఎస్ పదేళ్ల పాలన చూసిన తెలంగాణ జనం ఈసారి మార్పు కోరుకున్నట్లు కనిపిస్తుంది. ఉదయం నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఈసారి బీఆర్ ఎస్ ఓటమి పాలయ్యినట్లు తెలుస్తోంది. ఎన్నడు లేనివిధంగా కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది.
కాంగ్రెస్ విజయం ఖరారైన అనంతరం టీపీసీసీ చీఫ్ కీలక ప్రెస్మీట్లో మాట్లాడారు. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి అమరుడయ్యారని ఆయన అన్నారు. అదే రోజున ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. . రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను పెంచారు..
Revanth Reddy Tweet on Kodangal Peoples: కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తనూ కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. 32,532 మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డికి 107429 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 84897 ఓట్లు…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో హస్తం హవా కొనసాగుతుంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో కొనసాగుతుండగా.. కొన్ని స్థానాల్లో గెలుపొందారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో గెలుపొందారు. 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Telangana DGP Congratulates Revanth Reddy at his Residence: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిమిష నిమిషానికి ఉత్కంఠ పెంచుతూ చుట్టూ పోతుంది. దాదాపు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి నివాసానికి పోలీసులు అదనపు సెక్యూరిటీ బలగాలు పంపగా ఇప్పుడు రేవంత్ రెడ్డి నివాసానికి డీజీపీ అంజనీ కుమార్ వెళ్లినట్లు తెలుస్తోంది.…
కాంగ్రెస్ గెలుపు ధీమాపై సీనియర్ నేత వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముందు నుండి చెప్తున్నా.. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వీహెచ్ అన్నారు. ఇది ప్రజల విజయం.. బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలు చూసి కాంగ్రెస్ కు ఓటేసారన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని.. అది కూడా బాగా కలిసొచ్చిందని చెప్పారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని వీహెచ్ పేర్కొన్నారు.
Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్న కాంగ్రెస్ గత తొమ్మిదన్నర ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. నేతలు చేజారిపోవడం, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇక ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ఇలా పలు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌కి ఎదురులేకుండా పోయింది.