TPCC Chief Mahesh Kumar Goud: రిగ్గింగు సాధ్యం అయ్యే పనే కాదు.. ఓటమి భయంతో చేసే ఆరోపణే రిగ్గింగ్ అని జూబ్లీహిల్స్ ఎన్నికలను ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఓడిపోయే వాళ్ళు సహజంగా నిందలు వేస్తారని.. ఎగ్జిట్ పోల్స్ కంటే మా కార్యకర్తల సమాచారమే మాకు కీలకమన్నారు. తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన ముచ్చటించారు. మంచి మెజారిటీ తో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు, కార్యకర్తలు బాగా పని చేశారని వారందరికీ అభినందనలు తెలిపారు. వచ్చే ప్రభుత్వం తమదే అని జోష్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చాయన్నారు.
READ MORE: Rashid Khan: ‘మిస్టరీ గర్ల్’తో రషీద్ ఖాన్.. అసలు విషయం ఏంటంటే?
కేబినేట్ విస్తరణ తన పరిధిలో లేని అంశమని తెలిపారు. అనంతరం.. లోకల్ బాడీ ఎన్నికలపై మహేశ్‌కుమార్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయి. హైకోర్టు ఆదేశాలు చూస్తాం. అధిష్టానంతో మాట్లాడి ఎన్నికల పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో సీఎం, మంత్రులతో మాట్లాడి.. స్థానిక సంస్థల ఎన్నికల పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీజేపీ బీసీల రిజర్వేషన్ అడ్డుకుంటుందని ఆరోపించారు. కిషన్ రెడ్డి, సంజయ్ కనీసం కేంద్రం మీద ఒత్తిడి చేయడం లేదన్నారు.
READ MORE: Onion and Garlic: భారత్ లో పూర్తిగా ఉల్లి, వెల్లుల్లిని నిషేదించిన ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా..
తాను టీపీసీసీ అధ్యక్షుడిగా సంతృప్తిగా ఉన్నానని మహేశ్‌కుమార్ తెలిపారు. “టీపీసీసీ అధ్యక్షుడి పదవికే నేను మొగ్గు చూపుతా.. మంత్రి పదవి విషయంలో ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా.. బీసీ ముఖ్యమంత్రి నినాదం నా కోసం చేసింది కాదు.. కేబినెట్ లోకి వెళ్ళాలి అనే ఆశ నాకు లేదు.. సీఎం రేవంత్ తో నేను సఖ్యతతోనే పని చేస్తున్న.. ఏఐసీసీ కార్యదర్శి పదవి వచ్చినందుకు కుసుమ కుమార్ కి అభినందనలు.” అని ఆయన స్పష్టం చేశారు.