శాంసంగ్ (Samsung) తన కొత్త గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10 (Galaxy Tab S10) సిరీస్‌ను భారతదేశంలో ఆవిష్కరించింది. కంపెనీ శాంసంగ్ ట్యాబ్ ఎస్ 10 (Galaxy Tab S10) సిరీస్‌లో రెండు మోడళ్లను పరిచయం చేసింది. గెలాక్సీ ట్యాప్ ఎస్ 10 ప్లస్ (Galaxy Tab S10 Plus), గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10 అల్ట్రా (Galaxy Tab S10 Ultra) అనే దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లను లాంచ్ చేశారు.…
పాకిస్థానీ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్‌లు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్' త్వరలో భారతదేశంలో విడుదల కానుందని ఇటీవల ప్రకటించారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టీ20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తన అద్భుతమైన ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లి నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "రామ్ నగర్ బన్నీ". విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్లో "రామ్ నగర్ బన్నీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్…
ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. అందులో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క స్థానం కోల్పోయాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకోగా.. యశస్వి ఒక్క స్థానం సాధించి ఏడో స్థానానికి చేరుకున్నాడు.
ఈ రోజు కేంద్రం నుండి విడుదలైన రూ.12 వేల కోట్లు గతంలో వైఎస్ జగన్ చేసిన కృషి వల్లే వచ్చాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అసత్యాలను చెప్తున్నారన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడ్డారని.. అందుకే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.
ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా.. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్…
తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల అయింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకొచ్చారు. లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది.
కాసేపట్లో తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల కానుంది. లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది. కవిత భర్త, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించిన షూరిటీ బాండ్లను స్వీకరించి కవితను విడుదల చేయాలని వారెంట్ ఇచ్చింది. కాగా.. కవిత విడుదలకు ప్రాసెస్ జరుగుతుంది.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీల పొత్తుకు ఎజెండా లేదని.. కేవలం సీట్ల పంపకం కోసమైతే తాము ఏ కూటమిలోనూ చేరబోమని చెప్పారు.