వచ్చే ఏడాది ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) భారత్ తో ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వచ్చే ఏడాది జూన్, ఆగస్టు మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడేందుకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద దేశంలోని పేద రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది.
క్రిమినల్ కేసుల్లో బాలనేరస్తులకు బెయిల్ నిరాకరించొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర నేరస్థుడితో నైతిక, శారీరక సంబంధం, మానసికంగా ప్రమాదం ఉందని తేలితే తప్ప.. వారికి బెయిల్ నిరాకరించవద్దని స్పష్టం చేసింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త డిజైన్‌తో కర్వ్ ఈవీని రూపొందించింది. టాటా కర్వ్ ఎలక్ట్రికల్ వెహికల్ (EV)ను వచ్చే నెల (ఆగస్ట్ 7)న విడుదల చేయనున్నారు. ఈ కారు ఇంటీరియర్.. కొత్త ఎలక్ట్రిక్ కూపే SUV దాని అండర్‌పిన్నింగ్‌లను నెక్సాన్‌తో పంచుకుంటుంది. ఇంటీరియర్ దాని సబ్‌కాంపాక్ట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి.
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ సిరీస్ జూలై 26 నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 జూలై 26న పల్లెకెలెలో జరగనుంది. టీ20 సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఈ మైదానంలో జరుగనున్నాయి. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనతో భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన ప్రస్థానాన్ని…
బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ ఫ్రీడమ్ 125 ను జూలై 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత.. ఇప్పుడు టీవీఎస్ (TVS) మోటార్ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదటి గ్రౌండ్-అప్ సీఎన్జీ స్కూటర్‌ను తయారు చేయాలని యోచిస్తోంది. టీవీఎస్ మోటార్ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలపై పని చేస్తోంది.
అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సుమారు ఐదు నిమిషాల పాటు అమరావతి విధ్వంసంపై వీడియో రిలీజ్ చేశారు. కాగా.. వీడియో ప్లే అవుతున్నప్పుడు సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరావతి విధ్వంసం జరిగిన తీరు చూస్తుంటే బాధ కలుగుతోందని తెలిపారు. ఎంతో ఆలోచించి ప్రణాళికలు వేస్తే.. సర్వ నాశనం చేశారని ఆరోపించారు.
రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే వారు అమరావతినే రాజధానిగా అంగీకరిస్తారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. కరుడు గట్టిన తీవ్రవాది కూడా అమరావతికే ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలని అందరూ చెబుతున్నారని.. అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని చంద్రబాబు తెలిపారు.
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC 2024) పరీక్ష షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జులై 18 నుంచి ఆగస్టు 5వరకు CBRT విధానంలో రోజుకు రెండు షిఫ్ట్లలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. డీఎస్సీ పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు…
పర్యావరణం పట్ల నిరంతరం అవగాహన పెరగడం.. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల సీఎన్జీ (CNG) కార్లకు డిమాండ్ పెరిగింది. ఎంట్రీ లెవల్ కార్ల నుండి పెద్ద ఫ్యామిలీ ఎమ్‌పివిల వరకు ప్రస్తుతం సిఎన్‌జి ఇంధన ఎంపికతో అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లలో సీఎన్జీ కార్లకు నిరంతరం పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. వాహన తయారీదారులు అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో మారుతి సుజుకి స్విఫ్ట్ S-సీఎన్జీ నుండి టాటా నెక్సాన్…