Kavitha: తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల..
- తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల
- 18 ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను- కవిత
- ఈ ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నాను- కవిత
- నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాను- కవిత
- కేసీఆర్ బిడ్డను.. మొండిదాన్ని.. తప్పుచేయకున్నా జైలుకు పంపారు..
- అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారు- ఎమ్మెల్సీ కవిత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల అయింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకొచ్చారు. లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది. కవిత భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర రూ. 10 లక్షల ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. కాగా.. కవిత విడుదలకు కొన్ని గంటల పాటు ప్రాసెస్ జరిగింది. మరోవైపు.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు ఉదయం నుంచి కవిత కోసం వేచి చూశారు. కాగా.. కవిత జైలు నుంచి విడుదల కాగానే, ఆమెకు ఘన స్వాగతం పలికారు.
Read Also: AV Ranganath: కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన..
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
- Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
కవిత జైలులో నుంచి బయటకు రాగానే.. మొదటగా కొడుకు దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురైంది. తనను జైలులో వేసి ఐదున్నర నెలలు పిల్లలకు దూరం చేశారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం.. అందరికీ అభివాదం చేసింది. ఈ సందర్భంగా.. కవిత మీడియాతో మాట్లాడింది. 18 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నానని తెలిపింది. ఈ ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నానని.. తనను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పింది. కేసీఆర్ బిడ్డను, మొండిదాన్ని, తప్పుచేయకున్నా జైలుకు పంపారు.. అనవసరంగా తనను జగమొండిగా మార్చారని ఎమ్మెల్సీ కవిత తెలిపింది.
Read Also: Hyderabad: రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ..
కాగా.. జైలు నుంచి విడుదలైన కవిత.. ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆమెతో పాటు కేటీఆర్, హరీష్ రావు, పలువురు నేతలు అక్కడే బస చేయనున్నారు. తీహార్ జైలు నుంచి నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. రేపు సీబీఐ ఛార్జీషీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది. ఆ విచారణకు కవిత ఆన్ లైన్లో హాజరుకానున్నారు. అనంతరం.. హైదరాబాద్ కు రానున్నారు.
తాజావార్తలు
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
-
CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!