Ram Nagar Bunny: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. “రామ్ నగర్ బన్నీ” ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్..
- ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "రామ్ నగర్ బన్నీ". విస్మయ శ్రీ .. రిచా జోషి.. అంబికా వాణి.. రితూ మంత్ర హీరోయిన్స్
- దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్.. ప్రభాకర్ పొడకండ నిర్మాణం
- శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం
- రామానాయుడు స్టూడియోలో సినిమా ఫస్ట్ లుక్.. గ్లింప్స్ రిలీజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్లో “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు ఆర్థిక సహాయాన్ని హీరో చంద్రహాస్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు అందజేశారు .
ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభాకర్ తనకు సుపరిచితులని.. ఆయన రామ్ నగర్ బన్నీ సినిమా గురించి చెప్పి తనను ఇన్వైట్ చేశారన్నారు. ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది.. చంద్రహాస్ తమ అమ్మాయి క్లాస్ మేట్ అని చెప్పారు. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రహాస్ తన వంతు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి సినిమాకు హీరోలు అంతగా ఆకట్టుకోరు.. కానీ చంద్రహాస్ బాగున్నాడని అన్నారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు.. అతన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నని తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులు ఆయన ఎలా ఎదగాలని కోరుకుంటున్నారో ఆ స్థాయికి చంద్రహాస్ చేరుకోవాలని బెస్ట్ విశెస్ అందిస్తున్నా అని స్పీకర్ అన్నారు.
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
Sheikh Hasina: షేక్ హసీనాని ఇండియా నుంచి రప్పించేందుకు బంగ్లాదేశ్ చర్యలు..
హీరో చంద్రహాస్ మాట్లాడుతూ.. మా “రామ్ నగర్ బన్నీ” ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు థ్యాంక్స్ చెబుతున్నా అని అన్నారు. రెండేళ్ల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. తాను సినిమాల్లో ఒకలా, బయట మరొకలా బిహేవ్ చేయనని చెప్పారు. తన మనసులో ఏముందో అదే మాట్లాడుతుంటా.. అది కొందరికి నచ్చలేదు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారానన్నారు. అందుకు తమ అమ్మా నాన్నలు ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు. తమ నాన్న ప్రభాకర్ పేరు నిలబెట్టేలా కష్టపడతాను.. తన ప్రతిభను తన సినిమాల రిజల్ట్ ద్వారానే తెలియజేయాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.
‘ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా.. వాటిలో ఫస్ట్ మూవీగా రామ్ నగర్ బన్నీ మీ ముందుకు రాబోతోంది. నెక్ట్ మంత్ అక్టోబర్ లోనే తమ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇక నుంచి రెగ్యులర్ గా తమ మూవీ అప్డేట్స్ ఇస్తాం. అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ఒక ఫ్లోలో వెళ్తుంటుంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది. రామ్ నగర్ బన్నీ అనేది ఏ భాషలో సినిమా రిలీజ్ చేసినా కనెక్ట్ అయ్యే టైటిల్. ప్రజల్ని ఎంటర్ టైన్ చేయాలని ఎలా అనిపించిందో వాళ్లు వరద బాధల్లో ఉన్నప్పుడు కూడా నా వంతుగా సాయం చేసి వాళ్లకు సంతోషాన్ని పంచాలని అనిపించింది. అందుకే నా కొద్దిపాటి సంపాదనలో వీలైనంత తెలంగాణ, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా కలెక్షన్స్ లో 10 శాతం కూడా వరద బాధితుల సహాయార్థం అందిస్తాం. ఇప్పుడే కాదు భవిష్యత్ లోనూ నాకు వీలైనంత సహాయాన్ని సొసైటీ కోసం చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నా’ అని చంద్రహాస్ అన్నారు.
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!