స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని, రాష్ట్రాలు మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని అన్నారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని విన్నారు. గతంలో ఆ పదవి ఖాళీగా ఉండడంతో ప్రతిపక్ష నేత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడం ఇదే తొలిసారి.
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు.
దేశం ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది ప్రధాని మోడీ చారిత్రాత్మక మూడో టర్మ్‌లో మొదటి ప్రసంగం కావడం విశేషం.ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఇది వరుసగా 11వ సంవత్సరం.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ నుంచి ప్రత్యేక అతిథులను కేంద్రం ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, వివిధ సామాజిక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విభిన్న ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
ఎర్రకోటలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జన ఖర్గే గౌర్హాజరయ్యారు.
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. వరుసగా 10వ సారి ఎర్రకోటపై ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగువేయనున్నారు. ఉదయం 7.30కు జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరణ చేయనున్నారు.