PM Modi: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 77వ స్వాతంత్ర్య్ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 10వ సారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివర్ణ పతాకం ఆవిష్కరణ కంటే ముందుగా రాజ్‌ఘాట్ వద్ద జాతీపిత మహాత్మాగాంధీకి ప్రధాని నివాళులర్పించారు. దేశం నలుమూలల నుంచి 1800 మందిని అతిధులుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు. వారిలో 400 మంది సర్పంచ్‌లు ఉన్నారు. స్వాతంత్ర్య వేడుకలకు 10వేల మందితో నాలుగంచెల ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆజాదీ కా అమృతోత్సవ వేడుకలు ముగియనున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండా ఆవిష్కరణతో వరుసగా 10వసారి ఎర్రకోటపై మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ ప్రజలందరికీ ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదని.. దేశం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారన్నారు. అమరవీరుల త్యాగఫలితమే స్వాతంత్ర్యం. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని ప్రధాని మోడీ అన్నారు. ఎందరో త్యాగం ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. అమరవీరుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్యమన్నారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. అదే దేశాన్ని ముందుకు నడిపిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. దేశంలో సుస్థిర, శక్తివంతమైన ప్రభుత్వం అవసరమని అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారు కాబట్టే సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.
Read also: Vodafone Idea Q1 Results: తీరని వొడాఫోన్ ఐడియా కష్టాలు.. తొలి త్రైమాసికంలో రూ.7,840 కోట్ల నష్టం
అవినీతి రాక్షసి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లిందన్నారు. అవినీతి భూతం దేశాన్ని చాలా ఏళ్ళు పీడించిందని మోడీ గుర్తు చేశారు. సైన్యానికి వన్ ర్యాంక్, వన్ పెన్షన్ కోసం రూ. 70వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. ఈ నెలలోనే విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించనున్నామని ప్రధాని ఎర్రకోట నుంచి ప్రకటించారు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఇంటర్నెట్‌ను అందిస్తున్నామని మోడీ ప్రకటించారు. ఐదేళ్లల్లో పండున్నరకోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటపడేశామన్నారు. న్యూ ఇండియా అన్‌స్టాపుబుల్‌గా మారిందన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తి దేశంగా తయారు చేయనున్నామని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది మహిళా పైలట్లు ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ప్రపంచం మొత్తం ద్రవోల్బణంతో ఇబ్బందులు పడుతుందని.. కానీ ఇండియాను ద్రవోల్బణం నుంచి బయటపడేశామన్నారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్నాయని ప్రధాని మోడీ తెలిపారు.