ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వేకొద్దీ ఉగ్ర కుట్ర కోణాలు బయటకు వస్తున్నాయి. ఉగ్రవాది ఉమర్‌కు సంబంధించిన విషయాల్లో అంతర్జాతీయంగా జరిగిన కుట్ర వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ బ్లాస్ట్‌కు సంబంధించిన మరొక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో స్పష్టంగా కారు పేలిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
President Droupadi Murmu: భారీ వర్షం కురుస్తున్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రోజున ఎర్రకోటలో జరిగిన దసరా వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత సాయుధ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనేది ఉగ్రవాదమనే రావణుడిపై సాధించిన నిర్ణయాత్మక విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఎర్రకోటలోని మాధవదాస్ పార్కులో జరిగిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో రాష్ట్రపతి బాణం ఎక్కుపెట్టారు. Putin: భారత్ అవమానాన్ని ఎప్పటికీ అంగీకరించదు.. అమెరికాపై పుతిన్ ఫైర్.. ఈ సందర్భంగా…
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించడానికి, భవిష్యత్తులో సాంకేతికత ఆధారిత సవాళ్లను ఎదుర్కోవడానికి 2035 నాటికి ‘సుదర్శన్ చక్ర’ అనే జాతీయ భద్రతా కవచాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ మిషన్ వెనుక ఉన్న ప్రేరణను ప్రస్తావిస్తూ, ఇది శ్రీకృష్ణుని సుదర్శన చక్రం నుంచి ప్రేరణ పొందిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ మిషన్‌కు సంబంధించిన మొత్తం పరిశోధన, అభివృద్ధి,…
ప్రధానమంత్రి మోడీ స్వాతంత్య్ర దినోత్సవం వేళ తీపికబురును అందించారు. ఈసారి ప్రజలకు దీపావళి డబుల్ బహుమతి లభిస్తుందని అన్నారు. దీపావళి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ(GST) భారం తగ్గిస్తున్నట్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రకటించారు. జీఎస్టీ నిపణుల కమిటీ ఇచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘మేము పన్ను వ్యవస్థను సరళీకృతం చేశాము. గత ఎనిమిది సంవత్సరాలలో, మేము GST లో భారీ సంస్కరణలు చేశాము. దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించాము. మేము తదుపరి తరం GST…
Red Fort: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద తాజాగా సంచలనం రేపిన ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధానిలో ఐదుగురు బాంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఎర్రకోట ఆవరణలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వయసు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండే ఈ యువకులు ఢిల్లీలో కూలీలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. వారిని అరెస్ట్ చేసే సమయంలో వారి వద్ద బంగ్లాదేశ్‌కు సంబంధించిన పలు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారిని…
దేశ వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా వేడుకలు అంబరాన్నంటాయి. మాదవ్ దాస్ పార్క్‌లో శ్రీ ధార్మిక్ లీలా కమిటీ నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటలో తన ప్రసంగంలో ప్రతిసారీ.. రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వం ఏమి చేయబోతుందో సూచనలు ఇస్తూనే ఉన్నారు.
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో వరుసగా 11వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌లో ఇటీవలి రాజకీయ అశాంతి సమయంలో దాడులను ఎదుర్కొన్న హిందువుల భద్రత గురించి 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.