ముగ్గురు ఆర్మీ జవాన్లను చంపిన సంచలనాత్మక 2000 ఎర్రకోట దాడి కేసులో తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.
భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తూనే ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఇవాళ భారత్ గౌరవించుకుంటోందన్నని ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. దేశ ప్రజలందరికీ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Taj Mahal: ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే మన దేశంలో ఎక్కువ మంది సందర్శించిన చారిత్రక కట్టడంగా తాజ్‌మహల్ టాప్‌లో నిలిచింది. టికెట్ల కొనుగోళ్ల ద్వారా 25 కోట్ల రూపాయలకు పైగా ఇన్‌కమ్‌ని సంపాదించింది. అంటే నెలకు యావరేజ్‌గా 5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
ఇప్పటి వరకు వస్తున్న సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఏప్రిల్ 21వ తేదీన సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. సంప్రదాయం ప్రకారం.. ఎర్రకోట యొక్క ప్రాకారము నుండి ప్రధానులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ, సిక్కుల మతగురువు తేజ్‌బహుదూర్400వ జయంతిని పురస్కరించుకుని.. ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా.. సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు నరేంద్ర మోడీ.. అయితే, స్వాతంత్ర దినోత్సవం వేడుకల సమయంలో ప్రసంగించే ప్రదేశంలో కాకుండా…
ఢిల్లీ హైకోర్టు ఆక్తికరమైన పిటిషన్ దాఖలైంది. ఢిల్లీలో ఉన్న ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానా బేగం అనే మహిళ… ఢిల్లీ రాజు బహదూర్ షా జాఫర్-2కు తానే నిజమైన వారసురాలినని ఉద్ఘాటించింది. దీంతో ఎర్రకోటను తనకు అప్పగించాలని లేదా తగిన పరిహారం చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ తన పిటిషన్ ద్వారా కోర్టును కోరింది. 1857లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వర్గాలు బహదూర్ షాను పదవీచ్యుతుడిని చేశాయని… బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ…
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని మోదీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని…
భారత్-పాక్ సరహిద్దులతో మొదట కలలం సృష్టించిన డ్రోన్లు.. ఆ తర్వాత జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై దాడికే ఉపయోగించారు.. ఇక, అప్పటి నుంచి ఎక్కడ డ్రోన్లు కదలినా.. అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇవాళ ఎర్రకోట సమీపంలో డ్రోన్ ఎగరడంతో కలకలమే రేగింది.. వెంటనే ఆ డ్రోన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట వెనుక భాగంలో విజయ్ ఘాట్ మీదుగా డ్రోన్ ఎగిరింది.. ఈ ప్రాంతంలో వెబ్ సిరీస్ షూటింగ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చినా.. డ్రోన్‌కు మాత్రం అనుమతి లేదు..…