ఇండియా-పాక్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ హాట్ స్టార్ లో అత్యధికంగా చూశారు. దాదాపు 3.5 కోట్లకు పైగా మంది చూశారు. ఇంతకుముందు కూడా భారత్-పాక్ మ్యాచ్ తలపడినప్పుడు 3 కోట్ల మంది చూశారు. తాజాగా ఆ రికార్డును ఇప్పుడు చెరిపేసింది. మూడు కోట్లకు పైగా మంది హాట్ స్టార్ మ్యాచ్ లైవ్ చూస్తుండటం.. ఇది డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రికార్డుగా చెబుతున్నారు.
2023 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చారిత్రాత్మక వికెట్ తీశాడు. తొలి ఓవర్ తొలి బంతికే బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ క్యాచ్ పట్టాడు. ఈ వికెట్‌తో ట్రెంట్ బౌల్ట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా నిలిచాడు.
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సగటు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో కనీసం 1,000 పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ అత్యధిక బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు కూడా రోహిత్ శర్మ తర్వాత జాబితాలో ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ 65.2 సగటుతో పరుగులు చేస్తున్నాడు.
మొన్నటికి మొన్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాడు మార్క్రామ్ చెలరేగి ఆడాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డులకెక్కాడు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ ఫ్రేజర్ మెక్ గుర్క్ కూడా అరుదైన ఘనత సాధించాడు. 29 బంతుల్లో సెంచరీ చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్గా రికార్డులకెక్కాడు.
సౌతాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన ఆటగాడిగా చరిత్రలోకెక్కాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో మార్క్రామ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రీలంక బౌలర్లను చీల్చిచండాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ చరిత్ర సృష్టించాడు.
వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ రికార్డులు చూసుకుంటే అద్భుతంగా ఉన్నాయి. 17 ఇన్నింగ్స్‌ల్లో 65.20 సగటుతో 987 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. 6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. పాకిస్తాన్‌పై 140 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశాడు రోహిత్ శర్మ.
How Team India Can Become No. 1 in All Formats: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ వన్డే మ్యాచ్‌కు ముందు భారత్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. తొలి వన్డేలో ఆస్ట్రేలియాను ఓడిస్తే.. భారత్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళుతుంది. దాంతో ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన రెండో జట్టుగా టీమిండియా రికార్డుల్లో నిలుస్తుంది. ఇప్పటికే…
Rohit Sharma Eye on Virat Kohli’s Recod in IND vs SL Match: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 22 పరుగులు చేస్తే.. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023లో దాయాది పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అదే ఫామ్ లంకపై…
Jasprit Bumrah Becomes 3rd Indian Bowler to take Highest Wickets in T20I: యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా.. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగష్టు వరకు భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2022, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023, ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023, వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతోనే దాదాపుగా 11 నెలలు అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో శస్త్రచికిత్స చేయించుకున్న…