Rohit Sharma: ఆ క్రికెట్ దిగ్గజాలను అధిగమించిన ‘హిట్ మ్యాన్’.. వన్డే ప్రపంచకప్‌లో అరుదైన రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సగటు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో కనీసం 1,000 పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ అత్యధిక బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు కూడా రోహిత్ శర్మ తర్వాత జాబితాలో ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ 65.2 సగటుతో పరుగులు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ 63.5 సగటుతో పరుగులు చేసిన జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మెన్ వివ్ రిచర్డ్స్ మూడో స్థానంలో, ప్రస్తుత ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ నాలుగో స్థానంలో, సచిన్ టెండూల్కర్ ఐదో స్థానంలో ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌లో వివ్ రిచర్డ్స్ 63.3 సగటుతో, డేవిడ్ వార్నర్ 60.8 సగటుతో, సచిన్ టెండూల్కర్ 57 సగటుతో పరుగులు సాధించారు.
Read Also: Jasprit Bumrah: ఆఫ్ఘాన్పై 4 వికెట్లు పడగొట్టినా సంతోషంగా లేను.. కారణమదే..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
2023 ప్రపంచకప్‌లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా వన్డేల్లో 1,000 పరుగుల సంఖ్యను చేరుకోవడంలో విజయం సాధించాడు. దీంతో ప్రపంచకప్‌లో అత్యధికంగా 7 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. అంతేకాకుండా ఆఫ్ఘాన్ తో జరిగిన మ్యాచ్ లో.. రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును నెలకొల్పాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 253 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అతను 49 సగటుతో 10243 పరుగులు చేశాడు. అందులో 31 సెంచరీలు, 52 అర్ధ సెంచరీలు సాధించాడు.
Read Also: Varun Tej – Lavanya: లావణ్య వరుణ్ పెళ్లి అక్కడే.. రిసార్ట్ లొకేషన్ తెలిసిపోయింది!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..