భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రేజ్ మాములుగా ఉండదు. ఏ పనిలో ఉన్నా.. ఎక్కడున్నా సరే టీవీలకు అతుక్కుపోవాల్సిందే. అయితే ఒకప్పుడు దాయాదుల పోరు అంటే అందరు ఒకదగ్గర గూమికూడి మ్యాచ్ చూసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. ట్రెండ్ మారింది. టీవీలతో అవసరం లేకుండా.. డైరెక్ట్ గా మొబైల్ లోనే చూసేయొచ్చు. జియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఆప్ ల ద్వారా ఫోన్లలోనే ఎక్కువగా చూస్తున్నారు.
Read Also: Black hole: సూర్యుడి లాంటి నక్షత్రాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తినేస్తున్న బ్లాక్ హోల్..
అయితే తాజాగా నిన్న జరిగిన భారత్- పాక్ మ్యాచ్ లో.. 228 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది ఇండియా. ఈ చారిత్రాత్మకమైన మ్యాచ్‌ను టీవీల్లో కంటే.. ప్రత్యక్షంగా వీక్షించిన వారు రికార్డు స్థాయిలో ఉన్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను 2.8 కోట్ల మంది చూశారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు. ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించలేదు. వాస్తవానికి.. ఆసియా కప్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వద్ద ఉండగా.. అభిమానులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ను చూడవచ్చు.
Read Also: Physical Harassment: ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..! కాలేజ్ నుంచి వస్తుండగా ఎత్తుకెళ్లి..
ఈ రికార్డుపై బీసీసీఐ సెక్రటరీ జై షా ‘X’ వేదికగా స్పందించారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను 2.8 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారని ఆయన ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా.. జై షా తన ట్వీట్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను ప్రస్తావించారు. ఇంతకుముందు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వీక్షించిన రికార్డు ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్ పేరిట ఉంది. ఎందుకంటే.. ప్రపంచ కప్ 2019 చివరి మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. అందుకే 2.52 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్షంగా వీక్షించారు. కానీ ఇప్పుడు ఆ రికార్డును భారత్-పాక్ మ్యాచ్ అధిగమించింది.
Today’s #INDvsPAK has clocked 2.8 Crore concurrent users on @DisneyPlusHS – the highest for any India match in the history of digital. The previous best was #INDvsNZ 2019 @cricketworldcup semifinal with 2.52 Crore concurrent users 🇮🇳 #AsiaCup@StarSportsIndia
— Jay Shah (@JayShah) September 11, 2023