న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆడుతున్న తొలి వరల్డ్ కప్లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రవీంద్ర రికార్డుల్లోకెక్కాడు. ఈ వరల్డ్ కప్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర ఇప్పటివరకు 3 శతకాలు నమోదు చేశాడు.
జస్ప్రీత్ బుమ్రా వన్డే ప్రపంచ కప్ 2023లో ఓ అరుదైన ఘనత సాధించాడు. 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో ఏ ఇండియన్ బౌలర్ చేయలేని ఘనతను సాధించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లనే తొలి బంతికే వికెట్ తీశాడు.
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా బ్యాటర్లు సెంచరీల దగ్గరకు వచ్చి ఔట్ అయ్యారు. గిల్ 93 పరుగుల వద్ద ఔట్ కాగా, కోహ్లీ 88 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
వన్డే వరల్డ్ కప్ 2023 ఇండియాలో జరుగుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఉత్సాహం నెలకొంది. ప్రతీ మ్యాచ్ ను క్రికెట్ స్టేడియంకు వెళ్లి ఆతిథ్య జట్టుకే కాకుండా.. ఇతర జట్లను ప్రోత్సహిస్తున్నారు. ఇక స్టేడియంకు వెళ్లని వారైతే టీవీల్లో కానీ, ఫోన్లలో కానీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కు డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో అత్యధిక వ్యూయర్ షిప్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ రేటింగ్ పెరిగింది.
ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రపంచకప్ 2023లో ఈరోజు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్తోనే ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ సాధించాడు. ట్రావిస్ కేవలం 59 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. అంతేకాకుండా అతని దూకుడు ఇన్నింగ్స్ తో తన పేరును ప్రత్యేక జాబితాలో నమోదు చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను క్రాస్ చేశాడు. ఈరోజు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. దీంతో సెంచరీల పరంగా ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ కంటే తాను చాలా ముందున్నానని వార్నర్ తన సెంచరీతో చాటాడు.
విరాట్ కోహ్లీ వన్డే కెరీర్ లో మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను బ్రేక్ చేయనున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ 49 సెంచరీలు చేశాడు. సచిన్ 463 మ్యాచ్‌ల్లో 49 సెంచరీలు చేయగా.. కోహ్లీ మాత్రం కేవలం 285 మ్యాచుల్లోనే 48 శతకాలు బాదాడు. అయితే ఈ ప్రపంచకప్ టోర్నీలోనే ఆ రికార్డును బ్రేక్ చేయాలని కోహ్లీ చూస్తున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రికార్డ్ నెలకొల్పింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 275 పరుగులు చేసింది. దీంతో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా పంజాబ్ ముందుంది. ఇంతకుముందు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఈ రికార్డ్ ఉండేది. దాదాపు 10 ఏళ్ల రికార్డును పంజాబ్ బద్దలు కొట్టింది. ఐపీఎల్ 2013లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసింది.
అబ్బాయిల వల్ల కానీ పనిని అమ్మాయిలు చేశారు. దాంతో ప్రపంచ రికార్డు సృష్టించారు. బ్యూనోస్ ఎయిర్స్ నగరంలో చిలీతో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా మహిళల క్రికెట్ జట్టు టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్లో ఓ ఇన్నింగ్స్ లో 427 అత్యధిక పరుగులు చేసిన జట్టుగా అర్జెంటీనా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు.