Jasprit Bumrah Record: ఏడాది తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే రెండో బౌలర్‌గా బుమ్రా అరుదైన రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah Becomes 3rd Indian Bowler to take Highest Wickets in T20I: యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా.. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగష్టు వరకు భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2022, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023, ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023, వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతోనే దాదాపుగా 11 నెలలు అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఐర్లాండ్ టీ20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.
ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రీత్ బుమ్రా ఐర్లాండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన యార్కర్ కింగ్.. 2వ టీ20 మ్యాచ్‌లో 2 వికెట్లు తీశాడు. రెండో టీ20 మ్యాచ్‌లో బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో 15 పరుగులు ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. అది కూడా ఇన్నింగ్స్ చివరిదైన 20వ ఓవర్. దాంతో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరుపై లికించుకున్నాడు.
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక మెయిడిన్ ఓవర్‌లు వేసిన రెండో బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు నెలకొల్పాడు. టీ20లలో బుమ్రా 10 మెయిడిన్ ఓవర్‌లు వేశాడు. ఈ జాబితాలో ఉగాండా బౌలర్ ఫ్రాంక్ న్సుబుగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఫ్రాంక్ ఏకంగా 15 మెయిడిన్ ఓవర్‌లు వేశాడు. మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ (10), జర్మనీ బౌలర్ గులాం అహ్మదీ (10)లు ఉన్నారు. ఆ తర్వాత 8 మంది ప్లేయర్స్ 6 మెయిడిన్ ఓవర్‌లు వేశారు.
Also Read: Asia Cup 2023: షాకింగ్ న్యూస్.. ఆసియా కప్ నుంచి శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఔట్!
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్‌లను జస్ప్రీత్ బుమ్రా అధిగమించాడు. 80 మ్యాచుల్లో 96 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చహల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచుల్లో 90 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న బుమ్రా 62 మ్యాచ్‌ల్లో 74 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ 92 మ్యాచుల్లో 73 వికెట్లు, అశ్విన్ 65 మ్యాచ్‌లు ఆడి 72 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!