ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ గెలుపు బోణి చేసింది. వరుసగా 8 పరాజయాల తర్వాత తొలిసారిగా గెలుపు రుచి చూసింది. రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా అతడు ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2018 నుంచి ఇప్పటివరకు ముంబై ఇండియన్స్…
గురువారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై వార్నర్ 26 బంతుల్లో 8 ఫోర్లు సహాయంతో 42 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా జట్టుపై అతడు వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆలగాడిగా వార్నర్ రికార్డు సృష్టించాడు. గతంలో పంజాబ్‌పై ఓవరాల్ ఐపీఎల్‌లో…
గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్‌లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాడు దీపక్ హుడాను అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో చరిత్ర సృష్టించాడు. దీంతో ఇప్పటివరకు మలింగ పేరిట ఉన్న రికార్డును బ్రావో బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు బ్రావో 171 వికెట్లు తీసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతడి తర్వాత స్థానంలో ఉన్న మలింగ…
రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సూపర్ డూపర్ హిట్‌తో అటు రామ్‌చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీతో ఎన్టీఆర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ యువ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఈ హీరోలు వరుస విజయాలు సాధిస్తే టాలీవుడ్ పరిశ్రమకు వచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. అయితే ఈ హీరోలు రెండేళ్లకు…
టీమిండియా 15 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో చివరి 5 ఓవర్లలో భారత్ అత్యధిక పరుగులు చేసింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో చివరి 5 ఓవర్లలో టీమిండియా 86 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్ చూడముచ్చటైన షాట్లతో అలరించి జట్టుకు భారీ స్కోరు అందించారు. కాగా 2007లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 80 పరుగులు, 2019లో బెంగళూరు వేదికగా…
దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి ఆదరణ ఉందని ఇప్పటికే పలు సర్వేలు నిరూపించాయి. అయితే దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మన ప్రధాని మోదీకి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మరో రికార్డు సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతల్లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్‌గా మోదీ యూట్యూబ్ ఛానల్ నిలిచింది. ఫిబ్రవరి 1 నాటికి ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటిని దాటింది. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో…
టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడి నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ రికార్డు అందుకున్నాడు. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. విదేశాల్లో సచిన్ వన్డేల్లో 5,065 పరుగులు చేయగా… విరాట్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన టాలీవుడ్, సౌత్ ఇండియా సినిమా ట్రైలర్‌గా రాధేశ్యామ్ ట్రైలర్ ఘనత సాధించింది. 24 గంటల్లో తెలుగులో రాధేశ్యామ్ ట్రైలర్‌కు 23.2 మిలియన్ల వ్యూస్ రాగా రెండో స్థానంలో ఉన్న బాహుబలి-ది కంక్లూజన్ ట్రైలర్‌కు 21.81 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మరోవైపు రాధేశ్యామ్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో వచ్చిన లైక్స్ చూస్తే… ఓవరాల్‌గా 5.9 లక్షల…
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్‌లకు గడువు ముగిసింది. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్‌లు రికార్డు స్థాయిలో దాఖలయ్యాయి. గత 5 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా అడ్మిషన్‌లు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో మొత్తం లక్షా 55 వేల 408 సీట్లు ఉంటే లక్షా 10 వేల 686 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. లక్ష దాటడం కూడా ఇదే మొదటి సారి అని వెల్లడించారు. Read Also: హైదరాబాద్‌లో…
ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. ప్రతి మ్యాచ్ లో బౌలింగ్ దాడిని ముందుండి నడిపిస్తాడు అశ్విన్. అయితే ఈరోజు కివీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో అశ్విన్ అనిల్ కుంబ్లే రికార్డు ను బ్రేక్ చేసాడు. అయితే ఈ ఒక్క ఏడాది టెస్ట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ ఇప్పటికే ఈ 2021 లో 50 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. అతని…