Young Tiger NTR: యువ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ అరుదైన రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సూపర్ డూపర్ హిట్‌తో అటు రామ్‌చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీతో ఎన్టీఆర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ యువ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఈ హీరోలు వరుస విజయాలు సాధిస్తే టాలీవుడ్ పరిశ్రమకు వచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. అయితే ఈ హీరోలు రెండేళ్లకు లేదా మూడేళ్లకు ఓ సినిమా చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో తన తోటి హీరోలకు సొంతం కాని ఓ రికార్డును జూనియర్ ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకున్నాడు. 2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా నుంచి ఇప్పటి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ వరకు వరుసగా ఆరు హిట్లు కొట్టిన ఘనతను ఎన్టీఆర్ సాధించాడు. దీంతో ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి డబుల్ హ్యాట్రిక్ హిట్ నమోదైంది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్.ఆర్.ఆర్ లాంటి వరుస హిట్లు ఎన్టీఆర్ సాధించాడు. వీటిలో ఏ సినిమా కూడా అభిమానులను నిరాశపరచలేదు. టెంపర్ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ వరుస ఫ్లాప్‌లను చవిచూశాడు. రామయ్య వస్తావయ్యా, రభస లాంటి డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఎన్టీఆర్‌తో పోల్చి చూస్తే యువ స్టార్ హీరోల్లో మరెవ్వరూ వరుసగా ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా ఆరు హిట్లను సాధించలేకపోయారు. పవన్ కళ్యాణ్ చివరి ఆరు సినిమాలు.. గోపాల గోపాల, సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాత వాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్. వీటిలో సర్ధార్ గబ్బర్ సింగ్, అజ్ఞాత వాసి సినిమాలు డిజాస్టర్లు. అయితే పవన్ తన కెరీర్ ప్రారంభంలో మాత్రం వరుస హిట్లను అందుకున్నాడు.
మహేష్‌బాబు విషయానికి వస్తే.. అతడి చివరి ఆరు సినిమాలు.. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు. వీటిలో బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి డిజాస్టర్లు ఉన్నాయి. ప్రభాస్ విషయానికి వస్తే.. అతడి చివరి ఆరు సినిమాలు.. రెబల్, మిర్చి, బాహుబలి, బహుబలి-2, సాహో, రాధేశ్యామ్. వీటిలో రెబల్, సాహో, రాధేశ్యామ్ సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి.
అల్లు అర్జున్ విషయానికి వస్తే అతడి చివరి ఆరు సినిమాలు.. సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, డీజే, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అలవైకుంఠపురంలో, పుష్ప వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి డిజాస్టర్ మూవీ ఉంది. అటు హీరో రామ్‌చరణ్ చివరి ఆరు సినిమాలలో గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ, ధృవ, రంగస్థలం, వినయ విధేయ రామ, ఆర్.ఆర్.ఆర్ ఉండగా.. వీటిలో బ్రూస్‌లీ, వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్ మూవీలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!