IPL 2022: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై వార్నర్ 26 బంతుల్లో 8 ఫోర్లు సహాయంతో 42 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా జట్టుపై అతడు వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆలగాడిగా వార్నర్ రికార్డు సృష్టించాడు. గతంలో పంజాబ్‌పై ఓవరాల్ ఐపీఎల్లో వార్నర్ 22 ఇన్నింగ్స్‌లలో 1,005 పరుగులు చేశాడు. తాజాగా కోల్‌కతాపై చేసిన 42 పరుగులతో కలిపి వార్నర్ 26 మ్యాచ్‌లలో 1,008 పరుగులు పూర్తి చేశాడు.
గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున వార్నర్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ ఏడాది మెగా వేలానికి ముందు ఆ జట్టు వార్నర్‌ను రిటైన్ చేసుకోలేదు. గత ఏడాది ఐపీఎల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో వార్నర్ కూడా సన్‌రైజర్స్ జట్టుకు ఆడటాన్ని ఇష్టపడలేదు. దీంతో అతడు మెగా వేలంలోకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ఢిల్లీ తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడిన వార్నర్ ఇప్పటివరకు 219 పరుగులు చేశాడు. అతడి సగటు 54.75గా నమోదైంది. ఐదు మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
Also Read
- Rohit-Hardik November 27: ఒకే తేదీ.. మూడేళ్లలో ఎంత మార్పు!! హార్దిక్ ముంబైలోకి వచ్చిన రోజే రోహిత్‌కు మళ్లీ కెప్టెన్సీ..
- Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
- IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
- Rohit Sharma: "సవాళ్లను స్వీకరించడానికి నేను రెడీ".. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్...
తాజావార్తలు
-
Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
-
Rohit-Hardik November 27: ఒకే తేదీ.. మూడేళ్లలో ఎంత మార్పు!! హార్దిక్ ముంబైలోకి వచ్చిన రోజే రోహిత్‌కు మళ్లీ కెప్టెన్సీ..
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!