ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ గెలుపు బోణి చేసింది. వరుసగా 8 పరాజయాల తర్వాత తొలిసారిగా గెలుపు రుచి చూసింది. రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా అతడు ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
2018 నుంచి ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డు సృష్టించాడు. 2018 సీజన్ నుంచి ముంబై తరఫున ఆడుతున్న సూర్యకుమార్ ఇప్పటివరకు 15 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 16 హాఫ్ సెంచరీలు చేయగా.. ఇందులో 15 హాఫ్ సెంచరీలను ముంబై తరఫునే సాధించాడు. మరో హాఫ్ సెంచరీని కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున పూర్తి చేశాడు. కాగా రాజస్థాన్‌తో మ్యాచ్‌లో తాను ఎలాగైనా చివరి వరకు ఆడాలని భావించానని.. తనకు తిలక్ వర్మ అద్భుత సహకారాన్ని అందించాడని కొనియాడాడు. తాను నంబర్-3లో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.