సెట్స్ పైకి వెళ్లకుండానే క్యూరియాసిటి కలిగిస్తోన్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంటస్ట్రింగ్ మ్యాటర్ లీకైంది.ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేయాలన్న ఉద్దేశంతో సినిమాలు ఎనౌన్స్ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఒకటా రెండా చేతిలో ఎన్ని ప్రాజెక్టులున్నాయో ఆయనకైనా తెలుసా అనేంతలా లైపన్ ఉంది. ప్రెజెంట్ రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు చేస్తున్న డార్లింగ్ డైరీలో సలార్2, కల్కి2 ఉండనే ఉన్నాయి. ఇవే కాకుండా…
బాహుబలి సినిమా తరువాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. దీంతో అన్ని పాన్ ఇండియా తరహా సినిమాలే చేస్తు వస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే.ఆ సినిమా థియేటర్లలో 50 రోజులు కంప్లిట్ చేసుకుంది కల్కి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రాజా సాబ్’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం హార్రర్, కామెడీ, రొమాంటిక్…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1100 కోట్లు కలెక్షన్స్ రాబట్టి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. ఇప్పటికే RRR, జవాన్ తాలూకు రికార్డులు బద్దలు…