బాహుబలి సినిమా తరువాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. దీంతో అన్ని పాన్ ఇండియా తరహా సినిమాలే చేస్తు వస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే.ఆ సినిమా థియేటర్లలో 50 రోజులు కంప్లిట్ చేసుకుంది కల్కి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రాజా సాబ్’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం హార్రర్, కామెడీ, రొమాంటిక్ సినిమాగా రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.
Also Read: Shraddha Kapoor: షాకింగ్.. ప్రభాస్ కల్కి ని దాటేసిన శ్రద్ధాకపూర్ సినిమా..
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయినా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతున్నాయి. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన గ్లింప్స్ చూసి ప్రభాస్ ను మళ్లీ వింటేజ్ లో చూసినట్టు ఉందని.. మిర్చి తరువాత మళ్లీ లవర్ బాయ్ గా కనిపించనున్నాడని తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. ప్రభాస్ మార్కెట్ గ్లోబల్ స్థాయికి వెళ్ళాక హార్రర్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తో సినిమా చేస్తూ ట్రేడ్ వర్గాలని ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాడు డార్లింగ్. దర్శకుడు మారుతి ఈ సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తాడో చూడాలి. రాజాసాబ్ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాతలైన మీడియా టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ప్రకటించారు.