రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1100 కోట్లు కలెక్షన్స్ రాబట్టి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. ఇప్పటికే RRR, జవాన్ తాలూకు రికార్డులు బద్దలు కొట్టాడు ప్రభాస్.
Also Read :Ustad: డబుల్ ఇస్మార్ట్ ను డబుల్ స్పీడ్ లో ముగించిన రామ్ పోతినేని
మరోవైపు ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ అందరి హీరోలలో ఇలా 5 సినిమాలు లైన్ లో ఉన్న ఒకే ఒక్కడు ప్రభాస్ మాత్రమే అని చెప్పడంలో మరో మాట లేదు. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వరుస సినిమాలు విడుదల చేసిన రెబల్ స్టార్ ఈ ఏడాది కల్కి తో బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 10 2025న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెప్టెంబరు నుండి హను రాఘవపూడి చిత్రం స్టార్ట్ చేయనున్నాడు. ఆ వెంటనే సెన్షేషనల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ వచ్చే ఏడాది జనవరిలో మొదలుపెట్టనున్నాడు. ఈ మూడు కాకుండా సలార్ -2, కల్కి -2 ఉండనే ఉన్నాయి. మిగిలిన స్టార్ హీరోలు ఒక సినిమానే రిలీజ్ చేయలేకుంటే ప్రభాస్ ఒకేసారి 5 సినిమాలు లైన్ లో ఉంచి తనకు తానె పోటీ అని మరోసారి రుజువు చేసాడు.