తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పెద్ద మార్కెట్. కానీ కొన్నాళ్లుగా రెండు రాష్ట్రాల్లోనూ రియల్ ఎస్టేట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఏపీలో అయితే గత దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ పడుకునే ఉంది. మధ్యలో రాజధాని అమరావతి నిర్మాణం మొదలైన తొలి రోజుల్లో వచ్చిన బూమ్ కారణంగా ఏడాది పాటు పర్లేదనిపించింది. ఆ సమయం మినహా ఇంకెప్పుడూ రియల్ ఎస్టేట్ బాగున్న దాఖలాల్లేవు.
హైదరాబాద్‌లోని టీ-హబ్ ఇన్నోవేషన్ హబ్ నుంచి ఉద్భవించిన ప్రాప్‌టెక్ స్టార్టప్ ‘నియర్ ఎస్టేట్’.. రియల్ ఎస్టేట్ రంగంలో మరో ఘనత సాధించింది. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ (రియల్ వ్యూ 360°) వర్చువల్ టెక్నాలజీలో 2000 ప్లస్ లిస్టింగ్‌లను అధిగమించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లపై బలమైన దృష్టితో నియర్ ఎస్టేట్ అత్యాధునిక వర్చువల్ రియాలిటీ (విఆర్), జియోస్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించి.. నివాస, వాణిజ్యపరమైన ఆస్తులను కొనుగోలుదారులు, ఎన్ఆర్ఐ, పెట్టుబడిదారులు ఎలా గుర్తించాలో మూల్యాంకనం చేసే…
రియల్ ఎస్టేట్‌లో నష్టాలు రావడంతో ఓ వడ్డీ వ్యాపారి 20 కోట్ల రూపాయలకు పైగా టోకరా పెట్టాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ఈ ఘటన కలకలం రేపుతుంది. వడ్డీ వ్యాపారిగా ఉన్న కూర్మదాసు హేమంత్.. కొత్తపేట మెయిన్ రోడ్ లో సత్య సూర్య బ్యాంకర్స్ ను ప్రారంభించి ఇందులో పార్టనర్ గా ఉన్నారు.. అయితే హేమంత్ తాకట్టు వడ్డీ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మరొకరితో భాగస్వామ్యగా ఉన్నారు.
AP Registration Charges : ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచే నిర్ణయంపై వెనకడుగు వేసింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవడంతో, ఈ నిర్ణయంపై పునరాలోచన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2025 జనవరి 1 నుండి భూముల మార్కెట్ ధరలను పెంచే యోచన తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నిర్ణయంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, అవసరమైన మార్పులు తీసుకోవాలని…
ఇటీవల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి. ఫ్రీ లాంచ్ ఆఫర్ ,బై బ్యాక్ పాలసీ పేర్లతో రియల్ ఎస్టేట్ కంపెనీలు నిండా ముంచుతున్నాయి. ఒక సైబరాబాద్‌లోనే 22 ఫ్రీ లాంచ్ ఆఫర్, 12 బై బ్యాక్ పాలసీ పేరుతో సంస్థలు మోసానికి పాల్పడ్డాయి.
రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందేలా చేయాలని సీఎం నాకు చాలా సార్లు చెప్పుకొచ్చారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధి కోసం కీలక ప్రకటన చేశారు. "విజన్-2025" పేరుతో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా, వరంగల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
హైడ్రా అనే పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు కేవలం బ్లాక్ మెయిల్ దందా చేసే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విధానాల వల్ల భూములు అమ్మడంలో జాప్యం అవుతూ రియల్టర్లు, బిల్డర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్‌లో రియల్ రంగానికి అనుకూల వాతావరణం ఉండడంతో అన్ని తరగతుల వారు నగరాన్ని స్వర్గధామంగా భావిస్తున్నారు. దీంతో ఈ మహా నగరం స్థిరాస్తుల విక్రయాల్లో దూసుకుపోతోంది.