Success Story: రియల్ ఎస్టేట్‌లో ‘నియర్ ఎస్టేట్’ సరికొత్త మైలురాయి!
- వర్చువల్ టెక్నాలజీలో 2000+ లిస్టింగ్‌లను అధిగమించిన నియర్ ఎస్టేట్
- రియల్ వ్యూ 360°లో వినియోగదారులకు సరికొత్త సౌకర్యం
- ఏ ప్రాంతంలో ఉన్నా నచ్చిన ప్రాపర్టీనీ సులభంగా చూసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని టీ-హబ్ ఇన్నోవేషన్ హబ్ నుంచి ఉద్భవించిన ప్రాప్‌టెక్ స్టార్టప్ ‘నియర్ ఎస్టేట్’.. రియల్ ఎస్టేట్ రంగంలో మరో ఘనత సాధించింది. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ (రియల్ వ్యూ 360°) వర్చువల్ టెక్నాలజీలో 2000 ప్లస్ లిస్టింగ్‌లను అధిగమించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లపై బలమైన దృష్టితో నియర్ ఎస్టేట్ అత్యాధునిక వర్చువల్ రియాలిటీ (విఆర్), జియోస్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించి.. నివాస, వాణిజ్యపరమైన ఆస్తులను కొనుగోలుదారులు, ఎన్ఆర్ఐ, పెట్టుబడిదారులు ఎలా గుర్తించాలో మూల్యాంకనం చేసే విధానాన్ని మారుస్తోంది.
తెలుగు మాట్లాడేవారికి గేమ్ ఛేంజర్ :
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో పట్టణీకరణ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పారదర్శకత, నమ్మకమైన రియల్ ఎస్టేట్ పరిష్కారాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ అవసరానికి తగ్గట్లు నియర్ ఎస్టేట్ సంస్థ ‘రియల్ వ్యూ 360°’తో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
వినియోగదారులు ఎక్కడున్నా తాము కొనుగోలు చేయాలనుకునే ప్రాపర్టీనీ సైట్ దగ్గరే ఉన్నట్లుగా వర్చువల్‌గా చూసేందుకు వీలు కల్పిస్తోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ఐటీ కారిడార్‌లలోని అపార్ట్ మెంట్‌లు, విల్లాల నుంచి.. పెరుగుతున్న పట్టణాలు, జిల్లాలలో ప్లాట్లు, ఇండిపెండెంట్ హోమ్‌ల వరకు కొనుగోలుదారులు ఇప్పుడు వీలైనన్ని ఎక్కువ సైట్స్ వ్యక్తిగతంగా వెళ్లి చూడాల్సిన అవసరం లేకుండా రియల్ వ్యూ 360° టెక్నాలజీతో ప్రతి వీధితో పాటు మారుమూలలను కూడా సులభంగా అన్వేషించవచ్చు.
ఈ టెక్నాలజీ గురించి నియర్ ఎస్టేట్ వ్యవస్థాపకుడు వెంకటరమణ గుద్దేటి మాట్లాడుతూ… ‘మా ప్రయాణం హైదరాబాద్‌లోనే ప్రారంభమైంది. ప్రస్తుతం మా సంస్థ ద్వారా 2,000 ప్రాపర్టీలను చేరుకోవడం మాకు కేవలం ఒక సంఖ్య కాదు.. తెలుగు మాట్లాడే సమాజానికి సేవ చేయాలనే మా నిబద్ధతను సూచిస్తుంది. మేం ప్రతి ఒక్కరికీ ప్రాపర్టీ అన్వేషణను సులభతరం చేయాలనుకుంటున్నాం. మొదటిసారి కొనుగోలు చేసేవారు, వారి కలల ఇంటిని కోరుకునే కుటుంబాల నుంచి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటికి పెట్టుబడి పెట్టాలనుకునే ఎన్‌ఆర్‌ఐల వరకు అందరికి సులభంగా సౌకర్యవంతమైనదిగా ఉండేలా చూపించడమే మా అంతిమ లక్ష్యం’ అని .
తెలిపారు.
స్థానిక బిల్డర్లు, ఏజెంట్లు, కొనుగోలుదారులకు సాధికారత :
తెలుగు రాష్ట్రాల్లోని బిల్డర్లు, డెవలపర్‌ల కోసం (RealView360°) వర్చువల్ ప్లాట్‌ఫారమ్ అనేది ఒక ముఖ్యమైన మార్కెటింగ్ టూల్. ఈ రియల్ వ్యూ 360°ద్వారా వర్చువల్ టూర్‌లతో ప్రాపర్టీ షోకేస్‌లు మరింత నమ్మకంగా, ప్రొఫెషనల్‌గా మారుతాయి. అంతర్గత ప్రదేశాలు, చుట్టుపక్కల పరిసరాలు రెండింటిని ఈ ఫుల్ రియల్ వ్యూతో కొనుగోలుదారులలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. కొనుగోలుదారులకు విలువైన సమాచారంతో పాటు నిర్ణయాలు తీసుకోవడంలో దోహపడుతుంది. పదే పదే వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరాన్ని నిర్మూలిస్తుంది. తద్వారా డెవలపర్లు ఆసక్తిగల కొనుగోలుదారులను మరింత సమర్థవంతంగా ఆకర్షించవచ్చు. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లు పర్సనలైజడ్ గైడ్‌లైన్స్ అందించడంపై దృష్టి పెట్టవచ్చు.
‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లు మరిన్ని అవకాశాలతో కళకళలాడుతున్నాయి. మొత్తం ప్రాపర్టీ షోకేస్ ప్రక్రియ మరింత పారదర్శకంగా సౌకర్యవంతంగా ఉంటుంది. తద్వారా స్థానిక వాటాదారులకు-బిల్డర్‌లు, ఏజెంట్లు, కస్టమర్‌లకు పూర్తి మద్దతివ్వడంలో మేం సంతోషిస్తున్నాం’ అని నియర్ ఎస్టేట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజేష్ మ్యకల తెలిపారు. ఎవరైనా ఒక వినియోగదారుడు విజయవాడ, వరంగల్, విశాఖపట్నం లేదా విదేశాలలో ఉన్నప్పటికీ, వారు తమకు ఇష్టమైన ప్రాంతంలోని ప్రాపర్టీలు, పరిసరాలను ఈ రియల్ వ్యూ ద్వారా సులభంగా చూసేయొచ్చని పేర్కొన్నారు.
ప్రపంచ తెలుగు డయాస్పోరాకు రిమోట్ క్యాటరింగ్ :
విదేశాల్లోని తెలుగు మాట్లాడే డయాస్పోరాతో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, యూకేలకు నియర్ ఎస్టేట్ భౌగోళిక అంతరాలకు వారధిగా నిలుస్తోంది. ఎన్ఆర్ఐలు ఇప్పుడు తమ స్వస్థలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను వర్చువల్‌గా అన్వేషించవచ్చు. వారి కుటుంబాలకు సమీపంలో ఉన్న ఇళ్లను లేదా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య హాట్‌స్పాట్‌లలో పెట్టుబడులను అంచనా వేయవచ్చు. ఇందుకోసం విమానాలను బుక్ చేసుకొని రావాల్సిన పనిలేదు. సమయం కూడా ఆదా అయ్యేలా ఉన్నచోటనే అన్ని తెలుసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ కొత్త టెక్నాలజీతో పెద్దగా పరిచయం లేని వారు కూడా సులభంగా వర్చువల్ టూర్‌ల ద్వారా నావిగేట్ చేయొచ్చు.
టీ-హబ్‌లో ఇన్నోవేషన్, గ్రోత్ :
భారత అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ (T-Hub) నుంచి పనిచేస్తున్న నియర్‌ఎస్టేట్ వేగంగా ఆవిష్కరణలతో పాటు స్కేల్‌ని పెంచడానికి డైనమిక్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ఉపయోగించుకుంది. స్టార్టప్ ఇండియా (DIPP165602) కింద పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (DPIIT)చే గుర్తింపు పొందింది. నియర్‌స్టేట్ టెక్నాలజీ అభివృద్ధి చేయడమే కాకుండా కంపెనీ లిస్టింగ్‌లను మరింత విస్తరించేందుకు సపోర్టును కలిగి ఉంది.
నియర్ ఎస్టేట్ నెక్ట్స్ ప్లానింగ్ ఇదే :
నియర్‌ఎస్టేట్ (NearEstate.in) ముందుచూపుతో.. ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఫీచర్‌లను ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తోంది. కొనుగోలుదారులు ఇంటీరియర్‌లను వర్చువల్‌గా కస్టమైజింగ్ విజువల్‌గా చూసే సౌకర్యం కల్పిస్తుంది. తద్వారా అడ్వాన్స్ డ్ డేటా అనలిటిక్స్ వినియోగదారులకు ప్రాపర్టీలు, మార్కెట్ ట్రెండ్‌లతో కంపేర్ చేసేందుకు వీలుగా ఉంటుంది. మరింత సమాచారంతో సులభంగా నిర్ణయం తీసుకునేందుకు దోహదపడుతుంది.
‘ఈ పురోగతిని సాధించడంలో మా లక్ష్యం స్పష్టంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బయట నివసించే ప్రజలు రియల్ ఎస్టేట్‌ను గమనించే విధానాన్ని పునర్నిర్వచించడమే. మేం నిరంతర ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాం. తెలుగు వారు ఎక్కడ ఉన్నా, వారి కొనాలనుకునే ప్రాపర్టీని కనుగొనే టూల్స్, ఇన్‌సైట్స్ కలిగి ఉండేలా చూస్తాం’ అని వ్యవస్థాపకుడు వెంకటరమణ గుద్దేటి పేర్కొన్నారు.
Nearestate.in గురించి :
హైదరాబాద్‌లోని టి-హబ్ కేంద్రంగా ఏర్పడింది నియర్ ఎస్టేట్. ఇదొక ప్రాప్‌టెక్ స్టార్టప్. ఈ ఫ్లాగ్‌షిప్ ప్రొడక్టులో రియల్ వ్యూ 360° (RealView360°) భాగంగా ప్రాపర్టీ టూర్లు, అధునాతన వర్చువల్ రియాలిటీ (VR), జియోస్పేషియల్ టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. తెలుగు మాట్లాడే కమ్యూనిటీకి ప్రపంచ ప్రేక్షకులకు ఒకేలా సేవలందించేలా ఈ రియల్‌వ్యూ360° టెక్నాలజీతో నియర్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త సౌకర్యాలకు వేదికగా నిలిచింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మరింత యాక్సస్ అందించేలా నమ్మదగినదిగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!