బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.
జన సమితి కోదండ రామ్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదా? అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వేలంపై ఆయన మాట్లాడారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని... ఈ భూములను కాపాడుతామన్నారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులని గుర్తు చేశారు. ఈ భూములను రాబర్ట్ వాద్రా కోసమే అమ్ముతున్నావా? అని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ భర్త కోసమే భూముల అమ్ముతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ దొంగ…
Etela Rajender : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలో ఉద్రిక్తత నెలకొంది. పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో జరిగింది, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బాధితులు, రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న విషయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఈటల,…