RBI Governor: కొత్త బాంబ్ పేల్చిన ఆర్బీఐ బాస్..! ఇకపై లెక్క కట్టాల్సిందేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Governor: డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం.. ఎందుకంటే చిన్న కిరాణ కొట్టు నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడికి వెళ్లిన చెల్లింపులు చేసే పద్ధతి మాత్రం ఒక్కటే అదే… యూపీఐ పేమెంట్స్. గుర్తుంచుకో మిత్రమా ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఇక నుంచి మరోలెక్క. ఇకపై యూపీఐ పేమెంట్స్ ఉచితం కాదని, పే చెల్లించాల్సిందే అని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అంటున్నారు. మరి ఏంటి దీని కథ.. చూసేయండి..
READ MORE: Suicide: భార్య, అత్తమామల వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..! హృదయవిదారక వీడియో..
Also Read
- Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
- EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
ఏ చిన్న ట్రాన్సాక్షన్‌కైనా
నేటి డిజిటల్ యుగంలో యూపీఐ చెల్లింపులు అనేవి మానవ జీవితంలో ఒక భాగమైపోయాయి. రోడ్డు మీద చిన్న షాప్స్ నుంచి బడా మాల్స్ వరకు యూపీఐ పేమెంట్స్‌ను తెగ వాడేస్తున్నారు. కానీ, రాబోయే రోజుల్లో యూపీఐ ఉచితంగా ఉండకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెబుతున్నారు. ఆయన బుధవారం మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ యూపీఐ ఎప్పటికీ ఉచితం అనే మాట చెప్పలేదు. యూపీఐ లావాదేవీలు ప్రాసెస్ చేయడంలో ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుంది” అన్నారు. అయితే ఆ ఖర్చు ఎవరు చెల్లించాలి అన్నది తేల్చాలని, అది ఎవరో ఒకరు చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. మల్హోత్రా వ్యాఖ్యలు చూస్తే యూపీఐ ఉచిత సేవలపై మార్పులు రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ ఉచితంగానే జరుగుతున్నా త్వరలో ఛార్జీలు ఉండబోతున్నాయని ఈ వ్యాఖ్యలు చూస్తే తెలుస్తుంది.
మీకు తెలుసా..
ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి ఫోన్‌పే, గూగుల్ పే లాంటి యాప్‌లపై యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మర్చంట్ యూపీఐ లావాదేవీలను నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లపై ప్రాసెసింగ్ ఫీజు విధిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎస్క్రో అకౌంట్లు ఉన్న అగ్రిగేటర్లకు ఒక్క లావాదేవీకి 2 బేసిస్ పాయింట్లు (గరిష్టంగా రూ.6 వరకు), ఎస్క్రో అకౌంట్ లేనివారికి 4 బేసిస్ పాయింట్లు (గరిష్టంగా రూ.10 వరకు) ఛార్జీ ప్రకటించింది. ఇంతకుముందు ప్రైవేట్ బ్యాంకులలో యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాత్రమే ఇలాంటి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
వీసా కంటే ముందుకు..
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఇటీవల విడుదల చేసిన “గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ పేమెంట్స్: ది వాల్యూ ఆఫ్ ఇంటర్ ఆపరెబిలిటీ” అనే రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ సుమారు 60 శాతం వాటా పొందింది. భారత్‌లో యూపీఐ 85 శాతం డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడుతోంది. ఇది వీసా కంటే ముందుకు వెళ్లిందని ఆ రిపోర్ట్ చెబుతోంది. ఈ వ్యవస్థ దీర్ఘకాలం నడవాలంటే, ఆ ఖర్చును వ్యక్తిగతంగా అయినా, గుంపుగా అయినా భరించాలి. అదే ముఖ్యమైన విషయం అని మల్హోత్రా వెల్లడించారు. ఛార్జీలు సంగతి రానున్న రోజుల్లో తెలియనుంది. అసలు ఈ ఛార్జీలు ఎవరిపై ఉంటాయి, ఎంత మొత్తంలో ఉంటాయనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
READ MORE: Jr NTR: నెపోటిజంపై ఎన్టీఆర్ సంచలనం.. నేను అలాంటోడిని కాదు!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!