మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘రావణాసుర’ ఒకటి. యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆడియో రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియా ఫేమస్ మ్యూజిక్ లేబుల్ సరిగమ ‘రావణాసుర’ ఆడియో రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. సరేగమ రైట్స్ దక్కించుకునేందుకు భారీగా ఖర్చు చేసిందని వినికిడి. అయితే ఆ ధర…
మాస్ మహారాజా రవితేజ, యువ దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి “రావణాసుర” అనే ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న విషయం తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. తాజా అప్డేట్ ఏమిటంటే… టీమ్ సుదీర్ఘమైన, ముఖ్యమైన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలు, అత్యంత తీవ్రమైన యాక్షన్ బ్లాక్‌లు కూడా రూపొందించారు మేకర్స్. అతి తక్కువ సమయంలోనే…
మాస్ మహారాజా రవితేజ ఇటీవలే “ఖిలాడీ”గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల అప్డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. రవితేజ కొత్త చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” ఇటీవలి కాలంలో చాలా మంది ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్డేట్ ను మేకర్స్ తాజాగా షేర్ చేశారు. Tiger Nageswara Rao ప్రీ లుక్,…
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈడీ కోర్ట్ ధిక్కరణ పిటీషన్ తో ముందు కొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈడీ అడిగిన అన్ని వివరాలు ఇచ్చేసింది ప్రభుత్వం. డిజిటల్ రీకార్డ్స్ ,కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదిక లను ఈడీ కి అందించినట్లు తెలిపింది ప్రభుత్వం. ఈడీ అడిగిన వివరాలు ఇచ్చినట్లు హైకోర్టు రిజిస్టర్ కు మెమో దాఖలు చేసింది ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై హైకోర్టులో కోర్టు…
మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం ‘ఖిలాడీ’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా… ‘తగ్గేదే లే’ అంటూ ముందుకు సాగిపోతున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. తాజాగా రవితేజతో ‘ధమాకా’ మూవీని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కొత్త షెడ్యూల్ ను షురూ చేశాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కు చెందిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీ విజయపథంలో సాగిపోతుండటంతో వారి ఆనందానికి హద్దులు…
మెగాస్టార్ తెర మీద కనిపిస్తే… మిగిలిన తారలంతా వెలవెలపోవాల్సిందే! చిరంజీవి కోసమే సినిమా థియేటర్లకు వెళ్ళిన ఆ రోజులను తలుచుకుని మెగాభిమానులు ఇప్పటికీ ఆనందపడుతూ ఉంటారు. ఆయన పక్కన ఎవరు హీరోయిన్, విలన్ అనే దానికి వారు అప్పట్లో ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. చిరంజీవి మేనరిజమ్స్, స్టైలిష్ స్టెప్స్, సూపర్ ఫైటింగ్స్ కోసమే సినిమాలు చూసేవారు. అయితే… ఇప్పుడు కాలం మారిపోయింది. ఎంత మెగాస్టార్ అయినా పక్కన కాస్తంత మాస్ మసాలా దట్టించే హీరోయిన్ ఉండాల్సిందే! అభిమానుల…
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఖిలాడీ’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో రవితేజ ఇద్దరు అందాల భామలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతితో రొమాన్స్ చేశాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించగా, డిఎస్పీ సంగీతం అందించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. “ఖిలాడి” ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైంది. అయితే థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం సరిగ్గా ఒక నెల తర్వాత ఈ మూవీ ఓటిటీ ప్రీమియర్లకు…
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబోలో తొలిసారి ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ధమాకా’ కొత్త యాక్షన్ షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజ, ఫైటర్స్‌పై భారీ సెట్లో టీమ్ ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్లు పర్యవేక్షిస్తున్నారు. Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్…
అనసూయ… బుల్లితెరకు గ్లామర్ రంగులు అద్దిన బ్యూటీ. స్మాల్ స్క్రీన్‌పై మసాలా పెంచే విషయంలో హాట్నెస్ అంటే ఏమిటో రీ డిఫైన్ చేసింది యాంకర్ అనసూయ భరద్వాజ్ అనే విషయం ఒప్పుకోవాల్సిందే. ఇక ఆ తరువాత వెండి తెరపై కూడా ఆమె తనదైన శైలిలో దూసుకెళ్తోంది. అయితే తాజాగా మాత్రం ఓ సినిమా వల్ల ఆమె చేసిన గ్లామర్ షో అంతా వేస్ట్ అయ్యిందే అంటున్నారు నెటిజన్లు. Read Also : Project K : తాజా…
మాస్ మహారాజ రవితేజపై ప్రముఖ దర్శకుడి భార్య చేసిన ఇన్ డైరెక్ట్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 11న “ఖిలాడీ” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా విడుదలకు ముందు హీరో, దర్శకుడి మధ్య విభేదాలు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ‘ఖిలాడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ చేసిన వ్యాఖ్యలు ఆ విభేదాలు నిజమే అనుకునేలా చేశాయి. దర్శకుడు రమేష్ వర్మకు నిర్మాత కోనేరు సత్యనారాయణ…