ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల్లో చిరంజీవి తరువాత టక్కున గుర్తొచ్చే పేరు మాస్ మహారాజా రవితేజ. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ చేసిన రవితేజ మాస్ మాహారాజా స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది. ఇక రవితేజ కు ఉన్న క్రేజ్ తో ఆయన తమ్ముళ్లు రఘు, భరత్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కానీ వారికి అంత పేరు రాలేదు. ఇక భరత్ ఒక రోడ్డుప్రమాదంలో మృతి చెందగా.. రఘు ప్రస్తుతం వేరే వ్యాపారాలలో బిజీగా మారాడు. ఇక ఈ కుటుంబం నుంచి రవితేజ నట వారసుడిగా అడుగుపెట్టేది ఎవరు అనేది ఎప్పటినుంచో అభిమానులను తొలుస్తున్న ప్రశ్న.. అయితే రవితేజ కొడుకు మహాధన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి పోలికలనే కాదు నటనను కూడా పుణికిపుచ్చుకొన్నాడు. రాజా ది గ్రేట్ లో మహాధన్ నటన హైలైట్ అని చెప్పాలి. అయితే ఈ కుర్రాడు ఏమైనా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా..? అంటే ఇప్పట్లో లేవనే తెలుస్తోంది. ప్రస్తుతం మహాధన్ చదువులో నిమగ్నమయ్యాడు.
చదువు పూర్తిచేసి కానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడని రవితేజ చాలాసార్లు చెప్పాడు. అయితే మరి గత రెండు రోజుల నుంచి రవితేజ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో ఎవరు అని అభిమానులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది.. తమ్ముడు రఘు కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడ్డాడట రవితేజ. అతగాడి పేరు మాధవ్.. వయస్సు 21.. ప్రస్తుతం మంచి ఫిజిక్ లేకపోయినా హీరో లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. ఎలా అయినా రవితేజకు కూడా మాధవ్ కొడుకే అవుతాడు. అంటే మాధవ్ కూడా రవితేజ వారసుడే అన్నమాట. ఇప్పట్లో మహాధన్ వచ్చే అవకాశాలు లేవు కాబట్టి తమ్ముడు కొడుకును హీరోగా చేసే బాధ్యతను పెదనాన్న తీసుకున్నాడని టాక్.. ఇప్పటికే రవితేజ ఆధ్వర్యంలోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు కూడా జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. మరి కొడుకును హీరోగా నిలబెట్టడానికి రవితేజ ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో చూడాలి.