Mega 154: ‘ఆచార్య’ ఎఫెక్ట్.. రవితేజ అవుట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. అయితే ఈ సినిమా ఎఫెక్ట్ మెగాస్టార్ తదుపరి సినిమాపై పడిందా..? అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమాల్లో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అని మెగాస్టార్ కన్ఫర్మ్ చేసేశారు.
ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే. ఈ పాత్ర కోసం రవితేజ రూ. 16 కోట్లు పారితోషికం అడిగినట్లు గతంలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా ఆచార్య ఎఫెక్ట్ వలన అంత బడ్జెట్ ను నిర్మాణ సంస్థ మోయలేమని చేతులు ఎత్తేసిందని, దీంతో రవితేజను తప్పించేసి ఆ ప్లేస్ లో యంగ్ హీరోను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య ప్లాప్ ప్రభావం తమ సినిమాపై పడకుండా బడ్జెట్ ను లిమిటెడ్ గా వాడి నష్టాల వరకు వెళ్లకుండా చూసుకోవడానికి మైత్రీ మూవీ మేకర్స్ తగినన్ని చర్యలు తీసుకుంటున్నారట ఇక నిర్మాతల మాటే తన మాట అని బాబీ కూడా సినిమాను తగిన బడ్జెస్ట్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇదంతా ఒక ఎట్టు అయితే ఇంకోపక్క రవితేజ షూటింగ్ లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడట. మరి ఇలాంటి సమయంలో రవితేజ ఎలా రియాక్ట్ అవుతాడో అనేది మేకర్స్ ఆందోళన చెందుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!