మాస్ మహారాజ రవితేజ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. తాజాగా టాలీవుడ్ లో రవితేజ తనయుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడనే టాక్ టాలీవుడ్ లో జోరందుకుంది. అయితే ఇంతకుముందే ‘రాజా ది గ్రేట్’ సినిమాతో వెండితెర అరంగ్రేటం చేశాడు. ఆ తరువాత నుంచి మహాధన్ హీరోగా రాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో రవితేజ కొడుకు విషయంలో స్వయంగా క్లారిటీ ఇచ్చారు. చదువు పూర్తయ్యాక మహాధన్ మూవీస్ లోకి వస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని టాక్ నడుస్తోంది.
Read Also : Mani Ratnam: సౌత్ సినిమాలపై స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా కాలేజీ నేపథ్యంలో సాగే ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో మహాధన్ హీరోగా సినిమా అంటూ ఓ స్టార్ డైరెక్టర్ రవితేజని కలిశారట. కథ విన్న వెంటనే రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ సినిమాకు దర్శకత్వంలో వహించనుంది సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అని టాక్. ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రవితేజను మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చిన ఈ యంగ్ డైరెక్టర్ ఆయన తనయుడిని కూడా లాంచ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. మరోవైపు రవితేజ ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.