మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘రావణాసుర’ ఒకటి. యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆడియో రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియా ఫేమస్ మ్యూజిక్ లేబుల్ సరిగమ ‘రావణాసుర’ ఆడియో రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. సరేగమ రైట్స్ దక్కించుకునేందుకు భారీగా ఖర్చు చేసిందని వినికిడి. అయితే ఆ ధర ఎంత అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.
Read Also : Acharya Event : కాజల్ ఊసే లేదు… విలన్ని కూడా పక్కన పెట్టేశారే !?
‘రావణాసుర’ సినిమాపై ఫస్ట్ లుక్ తోనే మంచి అంచనాలు పెరిగాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. రవితేజ ఈ మూవీలో లాయర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీలో సుశాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ అండ్ ఆర్టీ టీమ్ వర్క్స్ నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. మరోవైపు రవితేజ ఖాతాలో రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు వంటి ఆసక్తికర సినిమాలు ఉన్నాయి.