మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉండేదని కోహ్లీ చిన్ననాటి స్నేహితుడు, తెలుగు క్రికెటర్ ద్వారక రవితేజ అన్నాడు. యూకేలో విరాట్ కోహ్లీని కలిసినట్లు రవితేజ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సుమారు ఆరేళ్ల తర్వాత కోహ్లీ, తాను కలుసుకున్నామని.. వెంటనే విరాట్ నన్ను చిరు ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా పిలిచాడని రవితేజ వివరించాడు. అండర్-15 టైమ్‌లో కోహ్లీ, తాను ఒకే రూమ్‌లో ఉండేవాళ్లమని తెలిపాడు. రోజూ టీవీలో చిరంజీవి పాటలు వింటూ ఇద్దరం డ్యాన్స్ చేసే వాళ్లమని.. కోహ్లీ కూడా చిరంజీవి పాటలు వింటూ డ్యాన్స్ చేసేవాడు అని రవితేజ చెప్పాడు. అప్పటి నుంచి సొంత పేరుతో కాకుండా తామిద్దరం చిరు అని పిలుచుకుంటామని కోహ్లీతో గడిపిన రోజులను తెలుగు క్రికెటర్ రవితేజ గుర్తుచేసుకున్నాడు.ఆ మధుర జ్ఞాపకాలు ఇన్నాళ్లయినా అలాగే ఉన్నాయన్నాడు.
కాగా క్రికెటర్ రవితేజ స్వస్థలం కాకినాడ. కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తాడు. 2008-13 వరకు 32 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 375 పరుగులు చేశాడు. డెక్కన్ చార్జర్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. భారత అండర్-19 జట్టు తరఫున కూడా రవితేజ ఆడాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో మేఘాలయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని తన రూమ్మేట్ కోహ్లీ్కి కూడా అంటించాడు. అలా మెగాస్టార్ పాటలకు ఇద్దరూ డ్యాన్స్ చేసేవాళ్లు.