ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీ కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
కాళేశ్వరం నీటి చుక్క వాడకుండానే ఎల్లంపల్లి నుంచి నీరు పొదుపుగా వాడుకొని పెద్ద ఎత్తున వరి పంట పండించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్లు ఉంటే ఇప్పటికైనా క్లియర్ చేయాలని ఆయన సూచించారు.
రేషన్ కార్డుల జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలస కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్నా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రం రేషన్ కార్డులు జారీ చేయడం లేదు. దీంతో ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రాల తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తమకు ఓపిక నశించిందని ధ్వజమెత్తింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సికింద్రాబాద్‌లోని హాకీ గ్రౌండ్స్‌లో “ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌ల” పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు పదేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా గత కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదని.. కానీ ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు అందించాలని మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. వివిధ రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేశామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌లను ప్రవేశపెట్టామన్నారు. “సంక్షేమ…
Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జారీ చేయబోతున్న రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన నిబంధనలు మార్చాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
TG Ration-Health Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. సెప్టెంబరు 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపరిపాలన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా.. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు. అందులో భాగంగా.. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వాలని.. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Rythu Runa Mafi: ఆగస్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు రేవంత్ సర్కార్ విధివిధానాలపై కసరత్తు కొనసాగిస్తుంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను అందిస్తున్నారు.