తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సికింద్రాబాద్‌లోని హాకీ గ్రౌండ్స్‌లో “ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌ల” పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు పదేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా గత కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదని.. కానీ ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు అందించాలని మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. వివిధ రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేశామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌లను ప్రవేశపెట్టామన్నారు. “సంక్షేమ పథకాలకు సంబంధించిన వివిధ శాఖల సమాచారం ఈ ఒకే కార్డులో పొందుపరచబడుతుంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ద్వారా కేవలం ఒక క్లిక్‌తో 30 శాఖల సమాచారాన్ని పొందవచ్చని ప్రభుత్వం నిర్ధారిస్తోంది” అని ఆయన చెప్పారు.
Adani- Google Deal: దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌తో అదానీ గ్రూప్ డీల్..
అర్హత ఉన్న కుటుంబాలకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ రక్షణ కవచంగా పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ , ఇతర సంక్షేమ పథకాలకు కార్డు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు పర్యవేక్షణకు ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. “డిజిటల్ కార్డ్ మహిళను కుటుంబ పెద్దగా గుర్తిస్తుంది” అని ఆయన అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ తప్పిదాలు, అప్పుల కారణంగా రాష్ట్రం మునిగిపోతోందని, ఆ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్న కొద్దీ అప్పులు తీర్చుకుంటున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నవారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి భూమిని బదలాయించి కంటోన్మెంట్ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి.. నిరుద్యోగులను పదేళ్లుగా పీడించారని, అందుకే ప్రజలు తమను గద్దె దించారని, ఉద్యోగ నియామకాలు ప్రారంభించామని ఆయన వివరించారు.
Jr.NTR : దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ప్రకటించిన నిర్మాత నాగవంశీ