టాటా సన్స్ చైర్మన్ రతన్ నావల్ టాటా ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. రతన్ టాటా నిజాయితీపరుడు, నైతికత, పరోపకారం కలిగిన వ్యక్తి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా.. విజయం సాధించారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. కానీ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు ఆయన గొప్ప సూచనలు చేశారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందిస్తారు. డబ్బు సంపాదించి ధనవంతులు కావడమే దీని వెనుక లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి తల్లిదండ్రులలో మీరు కూడా ఉన్నట్లయితే..…
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) లాభం 4.99 శాతం పెరిగి రూ.11,909 కోట్లకు చేరుకుంది.
రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. టాటా కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఐటీ విభాగాన్ని సంస్థకు మూలస్తంభంగా మార్చారు. తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రతన్ టాటా.. వయో సంబంధిత సమస్యలతో బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రముఖులు అందరూ ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే అమెరికాలో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రతన్.. భారత్‌కు రావాలని అనుకోలేదు.…
Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం అర్ధరాత్రి అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన సోమవారం బీపీ పడిపోవడంతో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే.
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా ఇక లేరనే వార్త విని వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు కన్నీరు పెట్టుకుంటున్నారు. బాలీవుడ్‌తో అనుబంధం ఉన్న నేపథ్యంలో రతన్ టాటా నిర్మించిన సినిమాను కొందరు గుర్తుచేసుకుంటున్నారు. పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా.. ఓ…
Ratan Tata : భారతదేశపు అతిపెద్ద పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం ప్రపంచానికి వీడ్కోలు పలికారు. 86 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. రతన్ టాటా చాలా కాలంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు.
Ratan Tata’s Final Rites: కొలాబాలోని రతన్ టాటా నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ముంబైలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో పార్థివ దేహాన్ని ప్రముఖుల, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం నేడు సంతాప దినంగా ప్రకటించింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం…