హోసబాలే వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని "ఎప్పుడూ" అంగీకరించలేదని ఆరోపించారు. అలాగే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో సహా దాని వ్యవస్థాపక పితామహులపై దాడులు చేస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించారు.
మతం పేరుతో జరుగుతున్న అణచివేతలు, దౌర్జన్యాలన్నీ మతంపై అవగాహన లేకపోవడం వల్లే జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని అమరావతిలో మహానుభావ ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. మత ప్రాముఖ్యతను అభివర్ణిస్తూ.. దానికి సరైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మతం ఎప్పటి నుంచో ఉందని, దాని ప్రకారమే అన్నీ పని చేస్తాయన్నారు. అందుకే దానిని "సనాతనం" అంటారన్నారు. మతం గురించి అసంపూర్ణ జ్ఞానం కలిగి ఉండటం…
ప్రస్తుత కాలంలో మందిర్-మసీద్ వివాదాలు భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను బయటకు తీసి తాము కూడా హిందూ నాయకులం కావొచ్చని కొందరు అనుకుంటున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు.
RSS Leader: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నేత సునీల్ అంబేకర్ విజ్ఞప్తి చేశారు.
RSS Remarks Case: బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్‌కు పెద్ద ఉపశమనం దొరికింది. 2021లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని తాలిబాన్‌తో పోల్చినందుకు అతనిపై దాఖలైన పరువు నష్టం ఫిర్యాదు ఉపసంహరించుకోబడింది.
లోక్‌సభ ఎన్నికల్లో పేలవమైన పని తీరుకు బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పడంతో ఫడ్నవీస్ ఇంటికి సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అతుల్ లిమాయే పాల్గొన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కులగణనను సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించాలని మా అభిప్రాయమని, ఈ కసరత్తు చేస్తున్న సమయంలో సామాజిక సామరస్యం, ఐక్యత దెబ్బతినకుండా చూసుకోవాలని, ఆర్ఎస్ఎస్ కూడా హిందూ సమాజం కోసం పనిచేస్తుందని ఈ రోజు ప్రకటనలో వెల్లడించింది.
Digvijaya Singh: కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేశారు. దీనిపై ఆయనపై ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు
ఏడు దశాబ్దాలకు పైగా స్వాతంత్య్రం పొందిన తరువాత పాకిస్తాన్‌లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, విభజన పొరపాటుగా జరిగిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం అన్నారు.
Love Jihad: లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ముంబైలో వేలాదిమంది రోడ్లపై భారీ ప్రదర్శన చేపట్టారు. ముస్లింలు హిందువుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, హిందూ యువతులను ప్రేమ పేరుతో తీసుకెళ్లి, మతం మార్చుతుండటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.