RSS Remarks Case: బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్‌కు పెద్ద ఉపశమనం దొరికింది. 2021లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని తాలిబాన్‌తో పోల్చినందుకు అతనిపై దాఖలైన పరువు నష్టం ఫిర్యాదు ఉపసంహరించుకోబడింది. అయితే, ఫిర్యాదుదారుడు కేసును ఉపసంహరించుకోవడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు పేర్కొంది. ఈ కేసును ములుంద్ కోర్టులో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ SD చక్కర్ విచారించారు. నవంబర్ 8న ఈ కేసును పరిష్కరించగా.. ఈరోజు (సోమవారం) ఆర్డర్ కాపీ అందుబాటులోకి వచ్చింది.
Read Also: Koti Deepotsavam 2024 Day 10: కార్తీక మూడో సోమవారం.. ‘కోటి దీపోత్సవం’లో నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
అయితే, 2021లో జావేద్ అక్తర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్‌ను తాలిబాన్‌తో పోల్చడంతో వివాదానికి దారి తీసింది. ఆర్ఎస్ఎస్ నేత, లాయర్ సంతోష్ దూబే మొదట్లో అక్తర్‌కు లీగల్ నోటీసు జారీ చేశాడు.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. తన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే రూ. 100 కోట్ల నష్ట పరిహారం చెల్లించమని బెదిరించాడు. దానికి బాలీవుడ్ గీత రచయిత అక్తర్ అంగీకరించకపోవడంతో.. దూబే 2022లో క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదును దాఖలు చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, అక్తర్ దానిని ముంబై సెషన్స్ కోర్టులో సవాలు చేయగా.. మార్చ్ 2023లో సమన్లను సెషన్స్ కోర్టు సమర్థించింది.
Read Also: West Bengal Violence: బెంగాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు.. 15 మంది అరెస్ట్
ఇక, RSS భావజాలాన్ని తాలిబాన్‌తో పోల్చడంతో జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలతో పాటు సంస్థ పరువు, ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించాడని సంతోష్ దూబే పిటిషన్ లో పేర్కొన్నారు. అనేక వాయిదాల తర్వాత ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదుదారుడు కేసు విత్ డ్రా చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్ గీత రచయిత జావేద్ ఆక్తర్ ను నిర్థోషిగా తేల్చుతూ ముంబై సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.