ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో వయసుతో సంబంధం లేకుండా ప్లేయర్లు వస్తున్నారు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ 2025లో వైభవ్ సంచలనం సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ (101; 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) ఆడిన తీరును ఎవరూ మర్చిపోలేరు. దూకుడైన ఆట తీరుతో ఎక్కడైనా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సింగిల్స్ తీసినంతా ఈజీగా వైభవ్ సిక్సర్లు బాదేస్తున్నాడు. ఐతే యువ బ్యాటర్ వైభవ్ కెరీర్‌కు…
హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఢిల్లీతో ఈ నెల 15వ తేదీన ఆరంభమయ్యే మ్యాచ్ కోసం హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ బుధవారం 15 మందితో సభ్యుల కూడిన జట్టును ప్రకటించింది. అందులో తిలక్ వర్మను కెప్టెన్‌గా, రాహుల్ సింగ్ ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఒక బ్యాడ్ న్యూస్. భారత జట్టుకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ షెల్డాన్ జాక్సన్ తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు.
వెటరన్ బ్యాట్స్‌మెన్ షెల్డన్ జాక్సన్ గురువారం రంజీ ట్రోఫీలో రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా షెల్డన్ నిలిచాడు. రాజ్‌కోట్‌లో అస్సాంతో జరిగిన చివరి లీగ్ దశలో షెల్డన్ జాక్సన్ ఈ ఫీట్ సాధించాడు. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నమన్ ఓజా రికార్డును షెల్డన్ బద్దలు కొట్టాడు.
Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. రైల్వేస్‌తో ఢిల్లీ ఆడనున్న చివరి గ్రూప్ మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉన్నట్లు కోహ్లీ ప్రకటించాడు. జనవరి 30న రైల్వేస్‌తో ఢిల్లీ తలపడనుంది. ఇది ఇలా ఉండగా.. కోహ్లీ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఘజియాబాద్‌లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ ఢిల్లీకి మరోమారు ఆడబోతున్నాడు. 36 ఏళ్ల…
Kohli- Rahul: జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు.. తమ స్క్వాడ్‌లో ఇప్పటికే రిషభ్ పంత్‌తో పాటు విరాట్ కోహ్లీకి అవకాశం కల్పిస్తూ ఢిల్లీ క్రికెట్ సంఘం జాబితాను విడుదల చేసింది. కానీ, మెడ నొప్పితో కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడలేనని బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి.
Rishabh Pant: రాజ్‌కోట్‌లో జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో జరగనున్న ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి అశోక్ శర్మ మంగళవారం తెలిపారు. ఇకపోతే, పంత్ చివరిసారిగా 2017-2018 సీజన్‌లో రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడాడు. అయితే, ఈ రంజీ మ్యాచ్ కు ఢిల్లీ తరుపున టీమిండియా టాప్ బ్యాట్స్‌మెన్స్ లో ఒకరైన విరాట్ కోహ్లీ…
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కోల్పోయిన తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు కోసం తాజాగా రోహిత్ రంజీ జట్టుతో ప్రాక్టీస్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రోహిత్ ముంబయి రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. గత కొంతకాలంగా ఫామ్ లో లేకపోవడంతో అతడు జట్టులో చోటు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు పూర్తిగా విఫలమైంది. ఇకపోతే మరోవైపు, రోహిత్ శర్మ ఈ నెల…
Ranji Trophy Meghalaya vs JK: భారత్‌లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ సీజన్ కొనసాగుతోంది. ఎలైట్ గ్రూప్-ఎలో జరిగిన మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ మ్యాచ్‌లో 10 మంది బ్యాట్స్‌మెన్స్ 20 పరుగుల వ్యవధిలో ఔట్ అయ్యి పెవిలియన్‌కు చేరుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఇందులో ఐదుగురు బ్యాట్స్మెన్స్ ఖాతా కూడా తెరవలేదు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 9 మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు. దింతో మేఘాలయ మొదటి ఇన్నింగ్స్‌లో 73 పరుగులకు ఆలౌట్…
దాదాపు ఏడాది పాటు టీమిండియాకు దూరమైన మహ్మద్ షమీ ఆటను చూడాలంటే అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. రంజీ ట్రోఫీలో ఆడనున్న షమీ.. తదుపరి రెండు రౌండ్ల మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దేశవాళీ రెడ్ బాల్ టోర్నమెంట్‌లో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లతో జరిగే తదుపరి రెండు మ్యాచ్‌ల బెంగాల్ జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కలేదు.