Rishabh Pant: రాజ్‌కోట్‌లో జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో జరగనున్న ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి అశోక్ శర్మ మంగళవారం తెలిపారు. ఇకపోతే, పంత్ చివరిసారిగా 2017-2018 సీజన్‌లో రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడాడు. అయితే, ఈ రంజీ మ్యాచ్ కు ఢిల్లీ తరుపున టీమిండియా టాప్ బ్యాట్స్‌మెన్స్ లో ఒకరైన విరాట్ కోహ్లీ పాల్గొనడంపై క్లారిటీ లేదు. ఇదివరకు 2012లో కోహ్లీ తన చివరి రంజీ మ్యాచ్ ఆడాడు.
ఈ సీజన్‌లో భారత ఆటగాళ్లిద్దరూ ఢిల్లీ ఆటగాళ్ల జాబితాలో చేర్చబడ్డారు. ఈ జట్టులో మరో అంతర్జాతీయ ఆటగాడు హర్షిత్ రానా కూడా ఉన్నాడు. హర్షిత్ రాణా టీ20 సిరీస్‌లో భాగంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో, అతను ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. అందిన సమాచారం మేరకు పంత్ తదుపరి రంజీ మ్యాచ్‌కు ఆడనుంట్లు సమాచారం. అతను మ్యాచ్ కోసం నేరుగా రాజ్‌కోట్‌లో జట్టులో చేరతాడు. అయితే విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడుతాడా లేదా అనే విషయమై పూర్తి క్లారిటీ లేదు. ఇక హర్షిత్ రాణా భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు కాబట్టి అతను అందుబాటులో ఉండడు. రిషబ్ పంత్ స్వయంగా డీడీసీఏ ఛైర్మన్ రోహన్ జైట్లీకి ఫోన్ చేసి మ్యాచ్ కు తన లభ్యతను ధృవీకరించినట్లు ఒక నివేదికలో పేర్కొన్నారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) తన స్టార్ ప్లేయర్‌లను ప్రాబబుల్స్ జాబితాలో చేర్చడం సాధారణం. అయితే, తుది జట్టులో వారిని చేర్చడం వారి లభ్యతపై ఆధారపడి ఉంటుంది.