2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి దుబాయ్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో అన్ని ప్రధాన క్రికెట్ జట్లు పోటీపడుతున్నాయి. కాగా.. టీమిండియా ఈసారి పాకిస్తాన్ వెళ్లకుం.. దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ మెగా ఈవెంటుకు ముందు టీమిండియాకు ఒక బ్యాడ్ న్యూస్. భారత జట్టుకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ షెల్డాన్ జాక్సన్ తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు.
Read Also: Massive Traffic Jams: ‘‘4 గంటల ప్రయాణానికి 12 గంటల సమయం’’.. కుంభమేళా దారుల్లో ట్రాఫిక్ జామ్..
షెల్డన్ జాక్సన్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ప్రొఫెషనల్ క్రికెట్ నుండి తన రిటైర్మెంట్‌ను మంగళవారం ప్రకటించారు. అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు.. కానీ దేశవాళీ క్రికెట్‌లో అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింటిలో కూడా అతను మంచి ప్రతిభ చూపించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని గణాంకాలు బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అతని కెరీర్‌లో ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఉన్నాయి. అటువంటి ప్రదర్శనలు దేశవాళీ క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయడంలో సహాయపడ్డాయి.
Read Also: CM Chandrababu: అడవి మార్గంలో శ్రీశైలానికి వచ్చే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు
ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలు:
షెల్డన్ జాక్సన్ తన 105 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఎలాగైనా 7000+ పరుగులు సాధించాడు. ఇది ఒక అద్భుతమైన, అరుదైన ఘనత. 172 ఇన్నింగ్స్‌లలో అతను 46.12 సగటుతో 7242 పరుగులు చేశాడు. అందులో 39 అర్ధ సెంచరీలు, 21 సెంచరీలు ఉన్నాయి. షెల్డన్ జాక్సన్ అత్యధిక స్కోరు 186 పరుగులు. అయితే, అతనికి అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశాలు రాలేదు. దేశవాళీ క్రికెట్‌లో తన ప్రతిభను చూపించినప్పటికీ.. అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో ఆడే అవకాశం దక్కలేదు. అతని కెరీర్ మొదటి దశలోనే దేశవాళీ క్రికెట్ ఫీల్డ్‌లో మంచి పేరును సంపాదించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతను ఎంతో ప్రతిభ చూపించాడు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో అతనికి పిలుపు రాలేదు.