Kohli- Rahul: రంజీ మ్యాచ్‌లకు కోహ్లీ – రాహుల్ డుమ్మా.. అతడిపై మాత్రం వేటు!
- జనవరి 23 నుంచి రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ ప్రారంభం..
- మెడ నొప్పి కారణంగా రంజీకి దూరమైన విరాట్ కోహ్లీ..
- మోచేతి వద్ద నొప్పితో అందుబాటులో ఉండటం లేదని కేఎల్ రాహుల్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kohli- Rahul: జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు.. తమ స్క్వాడ్‌లో ఇప్పటికే రిషభ్ పంత్‌తో పాటు విరాట్ కోహ్లీకి అవకాశం కల్పిస్తూ ఢిల్లీ క్రికెట్ సంఘం జాబితాను విడుదల చేసింది. కానీ, మెడ నొప్పితో కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడలేనని బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆసీస్ టూర్ లో చివరి టెస్టులోనే మెడ పట్టేసిందని.. దానికి ఇంజెక్షన్లు కూడా వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో గాయం నుంచి కోలుకోవడానికి తగినంత సమయం ఇచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు టాక్. కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటంపై ఈరోజు క్లారిటి వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Parent Tips: పసిపిల్లలు ఆకలితో మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఏడుస్తారు
Also Read
- IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
- Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
- IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
- Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
కాగా, కేఎల్ రాహుల్ రంజీ టోర్నీలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని అందరు అనుకున్నప్పటికీ అతడి గాయం ఇంకా తగ్గలేదు. మోచేతి వద్ద నొప్పి ఉండటం వల్ల అందుబాటులో ఉండనని బీసీసీఐకి తేల్చి చెప్పాడని సమాచారం. దీంతో పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌కు అతడ్ని కర్ణాటక క్రికెట్ సంఘం పక్కనపెట్టింది. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న శుభ్‌మన్ గిల్ మాత్రం పంజాబ్ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఇక, రవీంద్ర జడేజా సైతం సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు.
Read Also: Polavaram Project: డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం!
అయితే, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన బ్యాటింగ్ తో అందరి దృష్టిని కరుణ్ నాయర్ ఆకర్షించాడు. అతడి రికార్డులను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. తాజాగా టీమిండియా ఉమెన్స్ మాజీ హెడ్ కోచ్ డబ్ల్యూవీ రామన్ స్పందిస్తూ.. ఒకవేళ కరుణ్ నాయర్‌ను స్క్వాడ్‌లకి తీసుకుంటే మాత్రం.. తుది జట్టులో స్థానం ఇవ్వాలన్నారు. అతడిని రిజర్వ్‌గా తీసుకోవడానికి కుర్రాడు కాదన్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో ఫైనల్లో ఆడించాలని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!