Virat Kohli: 13 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్న కింగ్ కోహ్లీ!
- రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమైన విరాట్ కోహ్లీ.
- 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం.
- కోహ్లీతో పాటు రంజీ ట్రోఫీలో ఆడనున్న మరికొంతమంది టీమిండియా ఆటగాళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. రైల్వేస్‌తో ఢిల్లీ ఆడనున్న చివరి గ్రూప్ మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉన్నట్లు కోహ్లీ ప్రకటించాడు. జనవరి 30న రైల్వేస్‌తో ఢిల్లీ తలపడనుంది. ఇది ఇలా ఉండగా.. కోహ్లీ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఘజియాబాద్‌లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ ఢిల్లీకి మరోమారు ఆడబోతున్నాడు. 36 ఏళ్ల కోహ్లీ మెడ నొప్పి కారణంగా జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌లో ఆడలేడని బీసీసీఐ వైద్య బృందానికి తెలిపాడు. అయితే, ఓ నివేదిక ప్రకారం అతను జనవరి 30 నుండి జరగనున్న ఢిల్లీ తదుపరి మ్యాచ్‌కు తన లభ్యత గురించి DDCA (ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్)కి తెలియజేశాడు.
Also Read: Ravi Abburi: నేను ఇక ఆపేస్తా.. చాలు.. టాలీవుడ్ రచయిత సంచలనం!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Virat Kohli is set to play in the Ranji Trophy for the first time in 13 years! He has confirmed availability to play for Delhi against Railways in the final round starting January 30 pic.twitter.com/hyhcbQtN8u
— ESPNcricinfo (@ESPNcricinfo) January 20, 2025
ఢిల్లీ తరఫున కోహ్లీ 23 మ్యాచ్‌ల్లో పాల్గొని 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీకి ఆడుతున్న సమయంలో కోహ్లీ 5 సెంచరీలు చేశాడు. 2009-10 సీజన్‌లో కోహ్లీ 3 మ్యాచ్‌ల్లో 93.50 సగటుతో 374 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. జాతీయ జట్టులో కోహ్లి సహచరుడు రిషబ్ పంత్ కూడా 6 సంవత్సరాల తర్వాత రాజ్‌కోట్‌లో మైదానంలో రంజీ ట్రోఫీ కోసం అడుగు పెట్టనున్నాడు. మరోవైపు జమ్మూకశ్మీర్‌తో ముంబై ఆడే మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆడనున్నాడు. రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్‌లో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజాలతో సహా ఇతర టీమిండియా క్రికెటర్లు కూడా తమ జట్లలో భాగం కానున్నారు. చూడాలి మరి రంజీ ట్రోఫీలో ఎంతమంది సీనియర్ ఆటగాళ్లు తిరిగి ఫామ్ అందుకుంటారో.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!