ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “భీమ్లా నాయక్” సందడి నెలకొంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే పాపులర్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో “భీమ్లా నాయక్” కన్పించడం లేదు. దీంతో పవన్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళ్తే… నైజాం ఏరియాలకు చెందిన తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు ప్రముఖ ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీ ‘బుక్ మై…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి క్రేజీ కాంబోలో వస్తున్న “భీమ్లా నాయక్” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు మేకర్స్. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “భీమ్లా నాయక్” గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతున్నాడు. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్టు…
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే, మరోవైపు సినిమాకు సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్‌కు హాజరు కాబోతున్న ముఖ్య అతిథులకు సంబంధించిన క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో దావానంలా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. ఈ సంవత్సరం ముఖ్యంగా టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్రాలలో ఇది ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా, “భీమ్లా నాయక్”ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాశారు. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం…
పాన్ ఇండియా సినిమాల కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తాడని ప్రకటించారు మేకర్స్. కానీ కరోనా వల్ల పరిస్థితులు తారుమారు అవ్వడంతో సినిమా కోసం రెండు విడుదల తేదీలను ఖరారు చేశారు. అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తే ముందు అనుకున్నట్టు ఫిబ్రవరి 25న మూవీని విడుదల చేస్తామని, లేదంటే ఏప్రిల్ 1న జనం ముందుకు తీసుకొస్తామని నిర్మాత ప్రకటించారు. అయితే తాజాగా సినిమా ఫిబ్రవరి 25నే విడుదల కన్ఫర్మ్…
ప్రతిసారి సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ పోటీ నెలకొంటుంది. బాక్స్ ఆఫీస్ బరిలో పెద్ద పెద్ద సినిమాలు నిలవడంతో సందడి సందడిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఫ్యామిలీతో కలిసి మరీ సంక్రాంతికి సినిమాలను చూడడానికి ఇష్టపడతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈసారి మాత్రం సంక్రాంతి పెద్ద సినిమాల సందడి లేదు. అయితే వరుసగా వారసుల ఎంట్రీ మాత్రం జరుగుతోంది. సంక్రాంతికి దాదాపు ఆరేడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో చెప్పుకోవాల్సిన పెద్ద సినిమా అంటే…
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి పెళ్లిపై సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే బాలయ్య ఆ కామెంట్స్ చేసింది పర్సనల్ గా కాదు. పాపులర్ టాక్ షోలో పాల్గొన్న రానాను ఫన్నీగా బాలయ్య ప్రశ్నించారు. టాక్ షో “అన్‌స్టాపబుల్” ఇటీవలి ఎపిసోడ్‌కు రానా దగ్గుబాటి అతిథిగా వచ్చారు. ఈ ఎపిసోడ్ వినోదాత్మకంగా సాగగా, బాలకృష్ణ, రానా దగ్గుబాటి ఇద్దరూ ఉల్లాసంగా కన్పించారు. కోవిడ్ సమయంలో ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న…
ఆహా ఓటీటీ వేదికగా అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఏడు ఎపిసోడ్లు పూర్తికాగా ఇప్పుడు 8వ ఎపిసోడ్‌గా రానా ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రోమోను ఆదివారం నాడు ఆహా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలయ్య, రానా మాట్లాడుకున్న విషయాలు అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. టాక్ షోలలోనే ది బెస్ట్ టాక్ షోగా అన్‌స్టాపబుల్ దూసుకుపోతోందని రానా చెప్పగా… ‘కొత్తగా చెప్తావేంటయ్యా… బాలయ్య…
“భీమ్లా నాయక్’ విడుదల తేదీకి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనుకున్నట్టుగానే ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా పడింది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదల వాయిదా అంటూ తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసులో నుంచి తప్పుకుంది. సంక్రాంతి రేసులో మూడు బిగ్ సినిమాలు ఉండగా, అభిమానులకు నిరాశ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” విడుదల వాయిదా పడుతుంది అంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఎన్నిసార్లు రూమర్స్ వచ్చినా మేకర్స్ మాత్రం అంతే గట్టిగా తగ్గేదే లే అంటూ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సంక్రాంతి రేసుకు సిద్ధమంటూ సినిమా నిర్మాత “భీమ్లా నాయక్” ముందుగా ప్రకటించినట్టుగానే జనవరి 12న రానుందని స్వయంగా ప్రకటించారు. దీంతో కొన్ని…