హీరోయిన్లతో రిలేషన్… రానా పెళ్లిపై బాలయ్య కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి పెళ్లిపై సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే బాలయ్య ఆ కామెంట్స్ చేసింది పర్సనల్ గా కాదు. పాపులర్ టాక్ షోలో పాల్గొన్న రానాను ఫన్నీగా బాలయ్య ప్రశ్నించారు. టాక్ షో “అన్‌స్టాపబుల్” ఇటీవలి ఎపిసోడ్‌కు రానా దగ్గుబాటి అతిథిగా వచ్చారు. ఈ ఎపిసోడ్ వినోదాత్మకంగా సాగగా, బాలకృష్ణ, రానా దగ్గుబాటి ఇద్దరూ ఉల్లాసంగా కన్పించారు. కోవిడ్ సమయంలో ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో రానా పెళ్లి ఆశ్చర్యం కలిగించిందని బాలకృష్ణ అన్నారు.
Read Also : ‘కేజీఎఫ్’ స్టార్ అసలు పేరు తెలుసా?
Also Read
- Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
- Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
“లాక్ డౌన్ టైములో వ్యాక్సిన్ వస్తుందని అనుకుంటే నీ పెళ్లి న్యూస్ వచ్చిందేంటయ్యా బాబూ ?” అని బాలయ్య ప్రశ్నించగా, జీవితంలో అన్నీ చూశానని, అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని రానా చెప్పాడు. “నేను గత పదేళ్లుగా మీ గురించి, మీ సంబంధాల గురించి చాలా గాసిప్స్ వింటున్నాను. చాలా మంది హీరోయిన్ల పేర్లు విన్నాను. మీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వినగానే రానా పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ ఎవరని అడిగాను. అమ్మాయి బయటి వ్యక్తి అని, పరిశ్రమకు చెందినది కాదని చెప్పారు. ఈ ట్విస్ట్ ఏంటి రానా?” అని బాలయ్య ప్రశ్నించారు. ఇండస్ట్రీ నుండి అది వర్కవుట్ కాలేదని రానా ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. ఎంత మందిని రిజెక్ట్ చేశారంటూ బాలయ్య అడగ్గా.. రిజెక్ట్ చేసినవాళ్లు చాలా మంది ఉన్నారని రానా బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య సాగిన ఒక గంట ఎపిసోడ్ ఫుల్ ఎంటెర్టైన్మెంట్ ను ఇచ్చింది ప్రేక్షకులకు.
తాజావార్తలు
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!