కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం నేపథ్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో ఉంది. నటుడి అకాల మరణం లక్షలాది మంది అభిమానులు మరియు అభిమానుల హృదయాలను బద్దలు చేసింది. ప్రస్తుతం కంఠీరవ స్టూడియోలో పునీత్ భౌతికకాయాన్ని ఉంచగా, ఈరోజు జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. అమెరికా నుంచి కుటుంబ సభ్యుల రాక ఆలస్యం అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పునీత్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు వినయ్ రాజ్ కుమార్…
ఈ ఏడాది సంక్రాంతికి చిత్ర పరిశ్రమలో గట్టి పోటీ నెలకొంది. స్టార్ హీరోలందరూ తగ్గేదే లే అన్నట్టుగా సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే రిలీజ్ డేట్స్ తో సహా ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా మూవీస్ ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’, ‘రాధే శ్యామ్’ సంక్రాంతి బరిలో నిలుస్తునట్లు తెలిపారు. అయితే వీరందరికన్నా ముందే ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరిలో దిగింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. తాజా షెడ్యూల్ లో పవన్, రానాలపై ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ లు కలిసి తీసుకున్న పిక్స్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు…
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత సినిమా ఇండస్ట్రీలో నెపోటిజంపై గట్టిగానే మండిపడ్డారు నెటిజన్లు. ఆ సమయంలో బంధుప్రీతిపై బాగా చర్చ జరిగింది. బాలీవుడ్ తారలను ఏకిపారేశారు. అయితే టాలీవుడ్ లోనూ బంధుప్రీతి ఉందంటూ కొందరు రచ్చ చేశారు. పైగా ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలే ఏలుతున్నాయని, బయట వారికి అవకాశాలు ఇవ్వట్లేదని, ట్యాలెంట్ ఉన్నవారిని తొక్కేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు. తాజాగా సెలెబ్రిటీ కుటుంబం నుంచి వచ్చిన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్.. కరోనా వేవ్ తరువాత స్పీడ్ అందుకున్న షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరులో చివరి షెడ్యూల్ కానున్నట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయాలతోనూ బిజీగా ఉండటంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఇప్పటికే పవన్ కు సంబందించిన ప్రధాన పార్ట్ ను పూర్తిచేసుకున్నాడు. రానా – సంయుక్త మీనన్ సన్నివేశాలను తెరకెక్కించాల్సి వుంది. ఈ చిత్రం షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి, అనుకున్న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో రానా భార్య పాత్రలో కనిపించాల్సిన ఐశ్వర్య రాజేష్ సినిమా నుంచి తప్పుకుందని, ఆమె పాత్రలో వేరే హీరోయిన్ నటిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నారు. ఐశ్వర్య పాత్రను మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ రీప్లేస్ చేసిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయాన్నీ సంయుక్త అధికారికంగా ప్రకటించేసింది. ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను…
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి మరో మల్టీస్టారర్ కు సిద్ధం అయ్యాడు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కోసం బాబాయ్ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు రానా. అయితే మరో యంగ్ హీరోతో స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడానికి రానా సిద్దమయ్యాడు. మరో టాలెంటెడ్ హీరో శర్వానంద్, రానా కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ రూపొందనుంది అనే వార్త గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న…
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి వరుసగా ఆసక్తికరమైన సినిమాలను సెట్ చేస్తున్నాడు. రానా నటించిన “విరాట పర్వం” త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పుడు ఇది షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు హీరోగానే అలరించిన రానా ఇప్పుడు సింగర్ గానూ మారి ఆకట్టుకోబోతున్నాడు. తొలిసారిగా రానా దగ్గుబాటి ఒక పాట కోసం తన స్వరాన్ని అందించబోతున్నారు. ‘విరాట పర్వం’లో రానా ఒక ప్రత్యేక పాట కోసం గొంతు అందివ్వబోతున్నాడు. వచ్చే వారం…
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో రీమేక్ చేయటానికి పవన్ కళ్యాణ్ అంగీకరించగానే రెండో హీరో పాత్ర పోషించేది ఎవరనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. చివరకు సినిమా ఎనౌన్స్ కావటం, పృథ్వీరాజ్ పోషించిన పాత్రను తెలుగులో రానా పోషిస్తుండటం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ రచన చేస్తుండటంలో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండటంతో టైటిల్ ‘భీమ్లా నాయక్’ అని పెట్టారు. అయితే దీంతో…
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయంలో హాజరైన నటుడు తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను అధికారులు విచారించారు. కాగా, ఈరోజుతో ముగిసిన సినీతారల విచారణ ముగిసింది. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో 12 మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైయ్యారు. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడీ విచారణ, తరుణ్ తో సినీ తారల విచారణ ముగిసింది. ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్…