టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి వరుసగా ఆసక్తికరమైన సినిమాలను సెట్ చేస్తున్నాడు. రానా నటించిన “విరాట పర్వం” త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పుడు ఇది షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు హీరోగానే అలరించిన రానా ఇప్పుడు సింగర్ గానూ మారి ఆకట్టుకోబోతున్నాడు. తొలిసారిగా రానా దగ్గుబాటి ఒక పాట కోసం తన స్వరాన్ని అందించబోతున్నారు. ‘విరాట పర్వం’లో రానా ఒక ప్రత్యేక పాట కోసం గొంతు అందివ్వబోతున్నాడు. వచ్చే వారం ఈ పాటను రికార్డ్ చేయబోతున్నారు.
Read Also : చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. జాగ్రత్త : పవన్ హెచ్చరిక
దర్శకుడు వేణు ఊడుగుల ఆలోచనను రానా ముందు ఉంచగా, ఆయన కూడా సాంగ్ పాడడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమాలో వచ్చే ఓ సందర్భోచిత పాట ఇది. పరిస్థితికి అనుగుణంగా సురేష్ బొబ్బిలి ఈ పాటను కంపోజ్ చేశారు. రానా దగ్గుబాటి ఈ సోషల్ డ్రామాలో నక్సలైట్ పాత్రలో కనిపిస్తారు. టీజర్ తో పాటు ఇప్పటికే విడుదలైన పాటలు ఈ ప్రాజెక్ట్ పై తగినంత బజ్ పెంచేశాయి. ‘విరాట పర్వం’ ప్రధానంగా హైదరాబాద్, వికారాబాద్‌లో చిత్రీకరించారు. ఇందులో సాయి పల్లవి కథానాయిక. సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు నిర్మాతలు. ‘విరాట పర్వం’ విడుదల తేదీపై ప్రస్తుతం సస్పెన్స్ ప్రస్తుతం కొనసాగుతోంది.