డానియల్ శేఖర్ కోసం రానాకి 4 కోట్లు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో రీమేక్ చేయటానికి పవన్ కళ్యాణ్ అంగీకరించగానే రెండో హీరో పాత్ర పోషించేది ఎవరనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. చివరకు సినిమా ఎనౌన్స్ కావటం, పృథ్వీరాజ్ పోషించిన పాత్రను తెలుగులో రానా పోషిస్తుండటం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ రచన చేస్తుండటంలో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండటంతో టైటిల్ ‘భీమ్లా నాయక్’ అని పెట్టారు. అయితే దీంతో తెలుగులో స్క్రిప్ట్ మొత్తం మారి వన్ సైడ్ గా ఉంటుందనే వాదనలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. అయితే నిర్మాత ఈ విషయమై ట్విటర్ లో మొత్తం చూసిన తర్వాత కామెంట్స్ పెట్టాలనడంతో సెకండ్ హీరో రానా పోషిస్తున్న డానియల్ శేఖర్ కూడా ప్రాధాన్యత ఉంటుందని అర్ధం అయింది. రానా ఈ సినిమా కోసం 25 డేస్ కాల్షీట్స్ ఇచ్చాడట. అంతే కాదు దాదాపు 4 కోట్ల పారితోషికం కూడా తీసుకుంటున్నాడట. నిజానికి సోలో హీరోగా రానాకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు.
అయినా తను డిమాండ్ చేసిన దానికి నిర్మాతలు ఓకె చెప్పటానికి కూడా కారణం ఉంది. ఇప్పుడున్న యువ హీరోలు ఈ పాత్రను పోషించాటానికి ఇష్టపడ లేదట. అందుకే రానా దానిని క్యాష్ చేసుకున్నాడని అంటున్నారు. అయితే ఏమాటకు ఆ మాట చెప్పాలి. విడుదలైన రానా ‘డానియల్ శేఖర్’ టీజర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్నట్లే ఈ పాత్రను తీర్చిదిద్దితే మాత్రం తప్పకుండా రానాకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం లేకపోలేదు. చూద్దాం… ఏం జరుగుతుందో!?
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!