పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. తాజా షెడ్యూల్ లో పవన్, రానాలపై ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ లు కలిసి తీసుకున్న పిక్స్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పవన్ మంచంపై పడుకుని ఉండగా, ఆ పక్కనే రానా కూడా ఫోటోలకు ఫోజిచ్చారు. చుట్టూ మార్కెట్ సెట్ ఉండగా, పవన్ షర్ట్ కు రక్తం, గాయమైనట్టుగా ఫొటోలో కన్పిస్తోంది. ఈ పిక్ చూస్తుంటే పవన్, రానా ల మధ్య ఫైట్ సీక్వెన్స్ హైలెట్ అవుతుందని అన్పిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.
Read Also : ‘లైగర్” హీరోయిన్ ఇంటిపై ఎన్సీబీ దాడులు
కాగా పవన్ కళ్యాణ్ త్వరలోనే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో తిరిగి జాయిన్ కానున్నాడు. మరోవైపు రానా, సాయి పల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.