కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం నేపథ్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో ఉంది. నటుడి అకాల మరణం లక్షలాది మంది అభిమానులు మరియు అభిమానుల హృదయాలను బద్దలు చేసింది. ప్రస్తుతం కంఠీరవ స్టూడియోలో పునీత్ భౌతికకాయాన్ని ఉంచగా, ఈరోజు జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. అమెరికా నుంచి కుటుంబ సభ్యుల రాక ఆలస్యం అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పునీత్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు వినయ్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రయలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం బొమ్మై, ప్రభుదేవా, గవర్నర్ గెహ్లాట్ సహా ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
Read Also : పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు వాయిదా
ఇప్పటికే నందమూరి బాలకృష్ణ పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతం అయ్యారు. తాజాగా ఎన్టీఆర్, రానా కూడా బెంగుళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కు కడసారిగా కనీతి నివాళి అర్పించారు. అనంతరం పునీత్ అన్న శివరాజ్ కుమార్ ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. పునీత్ రాజ్ కుమార్ కు బాలకృష్ణ, చిరంజీవి, ఎన్టీఆర్ లతో మంచి అనుబంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుండి పునీత్ రాజ్‌కుమార్‌కు అత్యంత సన్నిహితులలో ఒకరు. ఎన్టీఆర్ ఆయన సినిమాకు ఒక పాటను కూడా పాడారు. ఇక కాసేపట్లో చిరంజీవి కూడా అక్కడకు చేరుకోనున్నారు.