AP New Districts: అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర జిల్లాల పునర్విభజనపై కీలక మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరమనే దృక్కోణంలో జరిగిన ఈ సమావేశం ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్‌ల పునర్విభజనపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు అనగాని సత్య ప్రసాద్, పొంగూరు నారాయణ, బిజి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. వర్చువల్ ద్వారా…
AP DGP Harish: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాల నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రంపచోడవరాన్ని సందర్శించారు. ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్లతో పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన జిల్లా పర్యటనకు వెళ్లారు.
రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే శిరీష, ఆమె భర్త భాస్కర్ అవినీతికి అంతే లేకుండా పోతుందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే దంపతుల వ్యవహారశైలి సొంత టీడీపీ నేతలకే నచ్చడం లేదట. ఇప్పటికే అనేక సార్లు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేని పిలిచి వార్నింగ్ ఇచ్చినా, అదేమీ పట్టనట్టు యధావిధిగా నియోజకవర్గంలో దందాలు కొనసాగిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే అవినీతి కార్యకలాపాలపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మిసవాల్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు.
Kidnap Mystery: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లూరి జిల్లా గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది. బలవంతపు పెళ్లి కోసమే కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి ఆమెను విడిపించారు. రంపచోడవరం ప్రాంతం.. దేవీపట్నం మండలం, శరభవరం సచివాలయంలో సోయం శ్రీసౌమ్య విలేజ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమె విధుల్లో ఉండగానే కొంత మంది దుండగులు ఇన్నోవా కారులో వచ్చి…
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎంకౌంటర్ జరిగింది. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని దేవిపట్నం మండలం కించకూరు-కాకవాడి గండి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. Also Read: Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్!…
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు రోజులు కావడంతో పర్యాటకులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఆనందంగా గడుపుతున్నారు. దానికి తోడు శీతాకాలంలో ప్రకృతి అందంగా కనిపిస్తుంది. మారేడుమిల్లి ప్రాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. దట్టమైన కొండల మధ్యలో చావడికోట వ్యూ పాయింట్‌కి పర్యటకులు ఎగబడుతున్నారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అల్లూరి ఏజెన్సీ ఘాట్‌లలో వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. నేడు సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.
తూ.గో జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. రంపచోడవరానికి చెందిన మద్దికొండ సుధాకర్ అదే గ్రామానికి చెందిన బాలికని పలు మార్లు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటా అన్ని చేపి బలవంతంగా విశాఖ తీసుకువెళ్లాడు. దీనితో బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో 20 ఏళ్లు జైలు శిక్ష…
SI Absconded : గంజాయి కేసులో స్మగ్లర్లు పట్టుపట్టడం సర్వసాధారణం.. కొన్నిసార్లు స్మగ్లర్లతో కుమ్మకయ్యే అధికారులు కూడా పట్టుబడుతుంటారు.. తాజాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా మోతిగూడెం ఎస్సై సత్తిబాబు కూడా గంజాయి కేసులో పట్టుబడ్డారు.. అయితే, ఎస్సైని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయం నుంచి పరారు కావడం సంచలనంగా మారింది.. దీంతో, రంపచోడవరం పోలీసుస్టేషన్ లో ఎస్సై పరారీపై కేసు నమోదు చేశారు పోలీసులు.. Read Also: Superstar Rajinikanth: బెజవాడకు సూపర్ స్టార్..…